మన్మధుడుకు అన్ని కలిసొస్తున్నాయి

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘మన్మధుడు 2’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో నాగ్ మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు. అయితే ఈ సినిమాను ఆగష్టు 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు తెలిసో తెలీకో ఇతర సినిమాలు చాలా సహాయం చేస్తున్నాయి.

తొలుత మన్మధుడు2 చిత్రానికి పెద్ద తలనొప్పిగా ఉన్న సాహో చిత్రం ఆగష్టు 15న రిలీజ్ కావాల్సి ఉండే. అయితే కొన్ని కారణాల వల్ల అది కాస్త ఆగష్టు 30కి వాయిదా పడింది. దీంతో పెద్ద సినిమాల బెడద నాగ్‌కు తప్పింది. అటు ఇప్పటికే రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్, డియర్ కామ్రేడ్ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద నెమ్మదించడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఇక ఈ వారం రిలీజ్ అయిన రాక్షసుడు, గుణ 369 కూడా మన్మధుడు దెబ్బకు థియేటర్లలో తగ్గుముఖం పడతాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద కింగ్ రాజ్యమేలనున్నాడు.

ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మన్మధుడు 2 చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ కాగా.. బుల్లితెరపై బిగ్ బాస్ 3 షోలో నాగ్ సందడి చేస్తుండటం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మన్మధుడికి అన్ని అంశాలు బాగా కలిసొస్తున్నాయని సినీ జనం అంటున్నారు.

Leave a comment