కొబ్బ‌రిమ‌ట్ట వ‌సూళ్ల‌తో స్టార్ హీరోల మైండ్ బ్లాక్‌

హృదయ కాలేయం అనే చిత్రంతో సంచలన స్టార్ అయిన సంపూర్ణేష్ బాబు మళ్లీ చాలా గ్యాప్ తర్వాత తెర మీదకు హీరోగా వచ్చాడు. హృద‌య కాలేయం త‌ర్వాత మ‌ధ్య‌లో సంపూ కొన్ని సినిమాలు చేసినా అనుకున్న క్రేజ్ రాలేదు. ఎట్ట‌కేల‌కు లాంగ్ గ్యాప్ తీసుకుని కొబ్బ‌రిమ‌ట్ట‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. రెండేళ్ల పాటు ఎన్నో వాయిదాలు ప‌డిన ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు మంచి హైప్ వ‌చ్చింది.

నాగార్జున మ‌న్మ‌థుడు 2, అన‌సూయ క‌థ‌నం, విశాల్ అయోగ్య లాంటి సినిమాల పోటీని త‌ట్టుకుని మ‌రీ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన కొబ్బ‌రిమ‌ట్ట మిగిలిన మూడు సినిమాల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. సినిమాలో కథ పెద్దగా లేనప్పటికీ సంపూ లెవల్లో సినిమా ఉంది. నాగార్జున మ‌న్మ‌థుడు 2ను సైతం హైద‌రాబాద్‌లోని పెద్ద థియేట‌ర్ల‌లో ఈ సినిమా క్రాస్ చేసేసింది.

ఇంకా చెప్పాలంటే నాగార్జున‌, బాల‌య్య లాంటి స్టార్ హీరోల‌కు సైతం సంపూ షాక్ ఇచ్చాడు. అగస్టు 9న విడుదలైన కొబ్బరిమట్ట సినిమా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తొలి రోజు రూ.2,88,111 గ్రాస్ వసూలు చేసింది. నాగార్జున నటించిన మన్మథుడు 2, బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు లాంటి సినిమాల ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ల కంటే ఇది ఎక్కువ కావడం విశేషం.

ఆర్టీస్ క్రాస్ రోడ్స్‌లో మన్మథుడు డే-1 గ్రాస్ కలెక్షన్స్ రూ.2,83,950 కాగా.. ఎన్టీఆర్ మహానాయకుడు గ్రాస్ కలెక్షన్స్ రూ.1,60,641. కొబ్బరిమట్టతో సంపూ ఈ కలెక్షన్లను బీట్ చేశాడు. ఓవ‌రాల్‌గా చాలా త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రూ.4 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. సంపూ దెబ్బ‌తో టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు.

Leave a comment