చిరంజీవిపై హృతిక్ సెన్సేషనల్ కామెంట్స్.. వీడియో పాతదే కాని.. సౌండింగ్ అదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి గురించి ఇండియన్ సినిమాలో ఏ స్టార్ ను అడిగినా గొప్పగానే చెబుతాడు. ఇండియన్ సినిమా స్టార్స్ లో మొదటిసారి ఒక హీరో కోటి రూపాయల పారితోషికం అందుకున్నది మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే. ఇప్పుడు చిరు బాలీవుడ్ మార్కెట్ పై కన్నేశాడు. ఇన్నాళ్లు తన సినిమాలను కేవలం టాలీవుడ్ వరకే పరిమితం చేసిన మెగాస్టార్ చిరంజీవి సైరాతో బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. అక్టోబర్ 2న సైరా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు పోటీగా అదేరోజు హృతిక్, టైగర్ ష్రాఫ్ వార్ సినిమా రాబోతుంది.

ఈ రెండు సినిమాల మధ్య ఫైట్ గట్టిగానే ఉండబోతుందని తెలుస్తుంది. ఇక చిరు సినిమాతో పోటీపై ప్రస్తుతం హృతిక్ ఎలా స్పందిస్తాడో తెలియదు కాని మెగాస్టార్ చిరంజీవి గురించి హృతిక్ ఎప్పుడో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి గారిని ఎన్నోసార్లు కలిశాను.. ఆయన ఓ పెద్ద స్టార్.. స్టార్ డం ను మించి ఆయనలో మానవత దృక్పధం.. స్నేహ స్వభావం బాగా ఉంటాయి. ఐఫా వేడుకల్లో స్వయంగా తాను ఇచ్చిన పార్టీలో చిరంజీవి గారు హాజరయ్యారు. పార్టీకి వచ్చిన అతిథులకు ఆయనే వడ్డించడం జరిగింది. వినయ విధేయతల్లోనే కాదు గౌరం ఇచ్చి పుచ్చుకోవడం లో కూడా తనకు చిరంజీవి గారే స్పూర్తి అని అన్నారు.

ఆయన ఇతరుల మీద చూపించే ప్రేమ తనకు బాగా నచ్చుతుందని అన్నారు హృతిక్ రోషన్. అయితే వీడియో పాతదే అయినా చిరు గురించి హృతిక్ మాట్లాడిన మాటలు మాత్రం అదిరిపోయాయి. వార్ వర్సెస్ సైరా సినిమాల్లో ఏది బాక్సాఫీస్ పై విజృభిస్తాయో చూడాలి. వార్ సినిమాను తెలుగులో భారీగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Leave a comment