Moviesసాహోలో గ్యాంగ్ లీడర్ సర్ ప్రైజ్.. నాని ప్లాన్ అదిరింది..!

సాహోలో గ్యాంగ్ లీడర్ సర్ ప్రైజ్.. నాని ప్లాన్ అదిరింది..!

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సీనిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమాలో విలన్ గా కార్తికేయ నటించడం విశేషం. ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న కార్తికేయ కెరియర్ మొదట్లోనే విలన్ గా సాహసమే చేశాడని చెప్పొచ్చు. ఇక గ్యాంగ్ లీడర్ ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నారు.

అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నాని ఉండకపోవచ్చు అందుకే ఆదివారం గ్యాంగ్ లీడర్ స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి మాట్లాడాడు నాని. ఇక ట్రైలర్ 28న రిలీజైనా 30న వస్తున్న ప్రభాస్ సాహో సినిమా ఆడుతున్న అన్ని థియేటర్స్ లో నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్ వస్తుందని తెలుస్తుంది. సో సాహోతో పాటుగా ఇంటర్వల్ టైం లో నాని సినిమా ట్రైలర్ ఎంటర్టైన్ చేస్తుందన్నమాట.

మొన్నమధ్య వచ్చిన గ్యాంగ్ లీడర్ టీజర్ సినిమాపై క్రేజ్ ఏర్పడేలా చేసింది. రైటర్ అయిన నాని ఓ లేడీ గ్యాంగ్ కు లీడర్ ఎలా అయ్యాడు. వారు చేయాలనుకున్న పనికి హీరో ఎలా సపోర్ట్ చేశాడు అన్నది సినిమా కథ. ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, శరణ్య వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఈ ఇయర్ ఆల్రెడీ జెర్సీతో హిట్ అందుకున్న నాని గ్యాంగ్ లీడర్ తో కూడా ఆ హిట్ మేనియా కొనసాగించేలా ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news