ప్రేక్షకులను బతిమాలుతున్న చిత్ర యూనిట్.. ఎవరు..?

యంగ్ హీరో అడవి శేష్ నటించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరు బాక్సాఫీస్ వద్ద ఆడియెన్స్‌ నోళ్లు వెల్లబెట్టేలా చేసింది. ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు ఇప్పటివరకు మరే తెలుగు సినిమాలో రాలేదని చెప్పొచ్చు. ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే సినిమా లవర్స్‌ను కట్టిపడేసింది. అంతలా ఆకట్టుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ తన సత్తా చాటుతోంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ప్రేక్షకులను కాల్లావేల్లా పడి బతిమాలుతున్నారు. ఇంతకీ వారు ఆడియెన్స్‌ను అంతగా ఏం బతిమాలుతున్నారో తెలుసా..?

ఎవరు సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఎవ్వరూ ఊహించని విధంగా ఉండటంతో ఆడియెన్స్ ఈ సినిమాను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వారు ఆ సంతోషాన్ని షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో ఇంటర్వెల్, క్లైమాక్స్‌లలో వచ్చే ట్విస్టులను రివీల్ చేసేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతున్నారు. ఇలా ట్విస్టులను ముందే రివీల్ చేస్తే సినిమా చూసే ఆడియెన్స్‌ ఆసక్తి తగ్గుతుందని వారు అంటున్నారు. దీంతో హీరో అడవి శేష్, రెజీనా, నవీన్ చంద్రాలు ఓ వీడియో తీసి ఇలాంటి ట్విస్టులను రివీల్ చేయొద్దంటూ ప్రేక్షకులను బతిమాలారు.

సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేసే ఆడియెన్స్‌ థ్రిల్‌ను చెడగొట్టదని వారు ప్రాధాయపడుతున్నారు. ఏదేమైనా సస్పెన్స్ సినిమాలకు తోపులా ఎవరు సినిమా రావడంతో ఈ సినిమా మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

Leave a comment