రాక్ష‌సుడు హిట్ టాక్‌… అయినా క‌ష్టాలు..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా చిత్రం రాక్షసుడుకు హిట్ టాక్ వచ్చింది. వరుస ఫ్లాపుల తర్వాత కోలీవుడ్లో హిట్ అయినా రాచ్చ‌స‌న్ సినిమాకు రీమేక్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాగుందని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఆల్రెడీ బాలీవుడ్ లో హిట్ అయిన సినిమా కావడంతో ఇక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. రాక్షసుడు హిట్ అయినా బెల్లంకొండ కష్టాలు తీరేలా కనపడటం లేదు.

కెరీర్ ప్రారంభం నుంచి ఒక హిట్ సినిమా కూడా లేని బెల్లంకొండ ఈ సినిమాతో మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సరైన ఓపెనింగ్స్ లేవు. ఇప్పటికే బెల్లంకొండ సినిమాలు చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకులు రాక్షసుడు సినిమా లైట్ తీసుకున్నారు. దీనికి తోడు రాక్షసుడు ఒక వర్గం ప్రేక్షకులను మాత్ర‌మే మెప్పించేలా ఉండటంతో చాలామంది ఈ సినిమాపై ఆసక్తి చూపలేదు. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బెల్లంకొండ గత సినిమాల కంటే చాలా తక్కువగా జరిగింది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మ‌రోవైపు గుణ 369 లాంటి అంచ‌నాలు ఉన్న సినిమా పోటీలో ఉండ‌డంతో రాక్ష‌సుడుకు కొన్ని ఏరియాల్లో థియేట‌ర్లు దొర‌క‌ని ప‌రిస్థితి.

బెల్లంకొండ ఈ సంతోషంలో ఉండ‌గానే ఆయ‌న తండ్రి ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. గ‌తంలో బాలీవుడ్‌లో హిట్ అయిన సినిమా స‌న్నివేశాల‌ను తెలుగులో ఆయ‌న తెర‌కెక్కించిన జ‌బ‌ర్ద‌స్త్ సినిమాలో వాడేశార‌ని బాలీవుడ్ సంస్థ ఫిర్యాదు చేసింది. ఇక బెల్లంకొండ జ‌బ‌ర్ద‌స్త్ శాటిలైట్ రైట్స్‌ను ఓ ఛానెల్‌కు అమ్మేశారు. బాలీవుడ్ సంస్థ ఫిర్యాదుతో ఆ సినిమా ప్ర‌సారం చేయ‌డానికి వీల్లేకుండా పోయింది. దీంతో ఆ ఛానెల్ ద‌గ్గ‌ర తీసుకున్న అడ్వాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఆ ఛానెల్ కేసు వేసింది.

Leave a comment