విప్పి చూపిస్తూ అందరు అవే అడుగుతున్నారంటే ఎలా..!

కొందరు హీరోయిన్స్ ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా సరే తెచ్చుకోలేని క్రేజ్.. ఇమేజ్ ఒకటి రెండు సినిమాలతో తెచ్చుకునే భామలు ఉంటారు. వారిని చూస్తే మిగతా హీరోయిన్స్ కుళ్లు కోవడం ఖాయం. స్టార్ గా ఎదగాలంటే మొదటి సినిమాతోనే క్రేజ్ తెచ్చుకోవాలి. అయితే కొందరు మాత్రం సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటారు. ఇదిలాఉంటే తెలుగులో మొదటి సినిమాతోనే సూపర్ హాట్ ఇమేజ్ తెచ్చుకున్న భామ పాయల్ రాజ్ పుత్.

ఆరెక్స్ 100 సినిమాలో ఆమె అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమాలో అమ్మడి అందాల ప్రదర్శనకు కుర్రాళ్ళ నిద్ర కరువైందని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత అమ్మడికి అలాంటి అవకాశాలే వస్తుండటం విశేషం. ప్రస్త్తుతం ఆర్డిఎక్స్ లవ్ అంటూ మరో సినిమా చేస్తుంది పాయల్ రాజ్ పుత్. తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలు తనని ఎంతసేపటికి హాట్ గా చూపించాలనే అనుకుంటున్నారు కాని తనలోని నటిని గుర్తించట్లేదని ఫీల్ అవుతుంది.

డైరక్టర్స్ అడిగినట్టు స్కిన్ షో చేస్తుంటే ఇక ఆమెలో టాలెంట్ గురించి దర్శక నిర్మాతలు ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి. పాయల్ పరువాలతో సినిమా నడిపించేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే అమ్మడు కేవలం అలాంటి సినిమాలకే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న సినిమాల్లో కూడా నటించాలని చూస్తుంది. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా, వెంకీమామ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడ్ రానున్న రోజుల్లో మరిన్ని క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.

Leave a comment