ముదురు హీరోయిన్‌తో ఆ హీరో రొమాన్స్‌

తమిళ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా అజిత్‌తో సినిమాలు చేసుకుంటూ వ‌చ్చిన శివ ఇప్పుడు సూర్య‌తో కమిట్ అయ్యాడు. అటు ఊర‌మాస్ డైరెక్ట‌ర్‌, ఇటు స్టైలీష్ హీరో కాంబినేష‌న్ కావ‌డంతో సినిమా ఎలా ? ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.

సూర్య 39వ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమాలో ముదురు ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే కాజ‌ల్ ఫేస్‌లో ముదురు చాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇండ‌స్ట్రీ నుంచి అవుట్ అవుతుంద‌నుకుంటున్న టైంలో ఆమెకు వ‌రుస‌గా ల‌క్కీ ఛాన్సులు వ‌స్తున్నాయి. బెల్లంకొండ సురేష్ వ‌రుస‌గా క‌వ‌చం, సీత సినిమాల్లో ఆఫ‌ర్లు ఇచ్చాడు.

ఇక ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది. యాక్ష‌న్ ప్ర‌ధానంగా తెర‌కెక్కే ఈ సినిమాలో సూర్య‌, కాజ‌ల్ మ‌ధ్య రొమాన్స్ కూడా అదిరిపోతుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా కెమెరామెన్ గా ప్రముఖ కెమెరామెన్ వెట్రీ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాను జనవరిలో పొంగల్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సూర్య – శివ కాంబినేష‌న్ అంటే అటు తమిళ్‌తో పాటు ఇటు తెలుగులోనూ భారీ అంచ‌నాలు ఉంటాయి. ఇటీవ‌ల వ‌చ్చిన అజిత్ – శివ విశ్వాసం తెలుగులో ఆడ‌లేదు. మ‌రి ఈ సినిమాతో అయినా వీరు తెలుగులో కూడా స‌త్తా చాటుతారేమో ? చూడాలి.

Leave a comment