భారతీయుడు 2 నుంచి తప్పుకున్న ఐశ్వర్య…!

విశ్వనటుడు కమల్ హాసన్, సంచలన చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ భారతీయుడు 2. ఈ చిత్రం నుంచి ఐశ్వర్య కూడా నటిస్తానని మాటిచ్చి ఇప్పుడు తప్పుకుందనే టాక్ వినిపిస్తుంది. ఇంతకు ఐశ్వర్యకు అంత కష్టం ఏమోచ్చి తప్పుకుంది.. ఇంతకు ఏ ఐశ్వర్య అనుకుంటున్నారా…? అదేనండి ఇప్పుడు తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐశ్వర్యా రాజేష్.

భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో కమల్ డ్యూయల్ రోల్ పోషించనున్నట్టు సమాచారం. కాజల్ అగర్వాల్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ద్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఐశ్వర్య రాజేష్ కూడా చిత్రంలో కీలక పాత్ర చేయనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు భారతీయుడు 2 నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది.

ఐశ్వర్య వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తాను భారతీయుడు 2 కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందట. ఈ క్రమంలో ఐశ్వర్య భారతీయుడు 2 చిత్రం నుండి తప్పుకుందని సమాచారం. ఐశ్వర్య రాజేష్ తెలుగు డెబ్యూ చిత్రం కౌసల్య కృష్ణమూర్తి ఈ రోజే విడుదల కాగా, ఈ చిత్రం మంచి టాక్తో దూసుకెళుతుంది. రైతుల సమస్యను, క్రికెటర్గా ఎదుగాలనుకొన్న యువతి కథను అద్భుతంగా మేళవిస్తూ చిత్రాన్ని రూపొందించారనే టాక్ వినిపిస్తుంది.

Leave a comment