బ‌న్నీకి ఇంత ఘోర అవ‌మాన‌మా..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బ‌న్నీ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బ‌న్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమాలో నటించనున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల బ‌న్నీకి హీరోయిన్ల కొర‌త తీవ్రంగా ఉంది. టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ల విష‌యంలో ఎలాంటి ? ఇబ్బంది ఉందో బ‌న్నీ కూడా ప్ర‌స్తుతం అలాంటి ఇబ్బందే ఎదుర్కొంటున్నాడు. హిందీ మార్కెట్‌పై కూడా దృష్టి పెట్టిన బ‌న్నీ త‌న సినిమా కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్లు అయిన అలియా భట్ ను సంప్రదించాల‌ని కోరాడ‌ట‌.

ఆమె ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తోంది. అదంటే రాజ‌మౌళి సినిమా కావ‌డంతో ఆమె ఓకే చెప్పింద‌ట‌. ఐకాన్ రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ స‌బ్జెక్ట్ అని భావించిన ఆమె రిజెక్ట్ చేసింద‌ట‌. తాజాగా లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన దిశా పటానిని సంప్రదించగా ఆమె భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసిందట.

ఆ రేటు చూసి షాక్ అయిన దిల్ రాజు ఆమెను కూడా ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా బ‌న్నీకి బాలీవుడ్ హీరోయిన్లు వ‌రుస‌గా నో చెపుతుండడం మ‌నోడికి పెద్ద అవ‌మాన‌మే అన్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. బ‌న్నీకి పెద్ద హీరోయిన్ల మీద ఆశ ఉన్నా వాళ్లు మాత్రం ఏదో ఒక కార‌ణంతో బ‌న్నీకి సెట్ అవ్వ‌డం లేదు.

Leave a comment