బావతో పోటీ పడుతున్న బన్నీ…!!

మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్‌తో మెగాహీరో స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ఓ విషయంలో పోటీ పడుతున్నాడట.. ఇంతకు బావా బామ్మర్థులు పోటీ పడటం అంటే అది మాంచి మజాగా ఉంటుందంటే నమ్మెచ్చు.. అయితే రామ్ చరణ్ తేజ్‌తో బన్నీ పోటీ పడటం అంటే మాటలు కాదు మరి.. ఇంతకు బావతో బామ్మర్థి ఎందులో పోటీ పడుతున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ బావాబామ్మర్థులు అందగత్తే కోసం పోటీ పడుతున్నారట..

ఒక్క అందగత్తే కోసం ఇద్దరు పోటీ పడుతున్నారా.. ఇదేమి చిత్రం అనుకుంటున్నారా.. కాదు కాదు.. బావ ఎక్కడి నుంచి అందగత్తెను పట్టాడో.. అక్కడే తాను ఓ అందగత్తేను పట్టాడట.. ఇందులో పోటీ పడుతున్నాడట బన్నీ బావతో… ఇంతకు ఈ సంగతేందో చూద్దాం… విషయం ఏంటంటే.. రామ్ చరణ్‌తేజ్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తోంది..

అయితే ఏంటి అనుకుంటున్నారా… ఇక్కడే ఉంది తిరకాసు… బావ బాలీవుడ్ భామ అలీయాభట్తో ఆడిపాడుతుంటే… నేనేందుకు గమ్మున ఉండాలని అనుకున్నాడట బన్నీ… తానూ కూడా బావ కన్నా మంచి అందగత్తేకు వలేయాలని అనుకున్నాడట… అనుకున్నదే తడువుగా బన్నీ లోఫర్ సినిమాలో నటించి, బాలీవుడ్‌కు వెళ్ళిపోయిన అందాల భామ దిశాపటానిని లైన్లో పెట్టాడట. ఇప్పుడు దిశాపటానినితో ఐకాన్ చిత్రంలో ఆడిపాడబోతున్నాడట… సో బావ బాలీవుడ్ బామను పడితే తాను కూడా బాలీవుడ్ బామను పట్టేసాడన్న మాట. ఇందులో బావాబామ్మర్థులు పోటీ పడుతున్నారన్నమాట…

Leave a comment