పూరి ‘జనగణమన’లో కె.జి.ఎఫ్ స్టార్..!

పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయ్యింది. ఎనర్జిటిక్ స్టార్ రాం హీరోగా వచ్చిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించారు. టెంపర్ తర్వాత 3 ఏళ్లు హిట్టు కోసం తపించిపోయిన పూరి ఫైనల్ గా ఇన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ తో హిట్టు కొట్టాడు. పూరి, ఛార్మి కలిసి నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమా తర్వాత పూరి ఏ సినిమా చేస్తాడన్న విషయం మీద డిస్క్షన్స్ మొదలయ్యాయి.

మహేష్ తో పోకిరి, బిజినెస్ మెన్ సినిమా చేసిన పూరి మహేష్ కోసం జనగణమన కథ రెడీ చేసుకున్నాడు. దేశంలో ఉన్న సమస్యలతో మహేష్ హీరోగా పూరి ఈ సినిమా చేయాలని కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. అయితే మహేష్ మాత్రం పూరికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈమధ్య ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన పూరి మహేష్ ఇప్పుడు ఓకే అన్నా తనకు ఓ క్యారక్టర్ ఉంది అన్నాడు. సో జనగణమన సినిమా మహేష్ తో లేనట్టే.

అయితే మహేష్ ప్లేస్ లో పూరి కె.జి.ఎఫ్ స్టార్ యశ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. కె.జి.ఎఫ్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న యశ్ కన్నడలోనే కాదు తెలుగు, తమిళంలో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కె.జి.ఎఫ్ పార్ట్ 2 సెట్స్ మీద ఉండగా ఆ తర్వాత పూరితో సినిమా చేసే ఛాన్స్ ఉంది. పూరి, యశ్ కలిసి జనగణమన సినిమా ఉంటుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

Leave a comment