ఆ హద్ధులు చేరిపేస్తేనే అసలు సిసలు మజా.. వామ్మో కాజల్ ఏంటి అతి..!

సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దశాబ్ధ కాలంగా కాజల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. కెరియర్ కాస్త వెనుకపడినట్టు అనిపించిన ప్రతిసారి మళ్లీ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది కాజల్. ఈమధ్యనే సీత, రణరంగం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజల్ ఆ రెండు సినిమాలతో పెద్దగా లాభ పడ్డది లేదు.

అయితే తేజ డైరక్షన్ లో లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత వరుస స్టార్ సినిమాల్లో నటించి సూపర్ సక్సెస్ అయ్యింది. హీరోయిన్స్ అందరు నటిగా తెర మీద అందంగా కనిపించేందుకు ఇష్టపడతారు అందుకే ఎమోషనల్ సీన్స్ లో తమ ఫుల్ ఎఫర్ట్ పెట్టరు. కాని తనలోని ఈ విషయాన్ని గమనించిన తేజ హద్ధులు దాటితేనే అసలు నటన బయటకు వస్తుందని చెప్పారని ఆయన చెప్పిన దగ్గర నుండి అలానే చేస్తున్నానని అన్నారు కాజల్.

హద్ధులు దాటితేనే అసలైన మజా ఉంటుందని అలా నటించడం మొదలు పెట్టిన టైం నుండి తన మీద తనకే తెలియని నమ్మకం ఏర్పడిందని అన్నారు కాజల్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కాజల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా మరికొన్ని సినిమాల్లో నటిస్తుందని సమాచారం.

Leave a comment