Gossipsఅమ్మ చరణ్... సాహో వెనుక ఇంత కథ ఉందా...!

అమ్మ చరణ్… సాహో వెనుక ఇంత కథ ఉందా…!

మెగా పవర్స్టార్ రామ్చరణ్ తేజ్… మెగాస్టార్ చిరంజీవి తనయుడు… చిరుత సిని అరంగ్రేటంలో కేవలం మెగాస్టార్ తనయుడిగానే అనుకున్నారంత… కానీ రానూ రానూ రామ్ చరణ్ చిరుతలా వచ్చి… సింహంలా తయారవుతున్నాడట… అందుకే ఇప్పుడు ఏకంగా అటు నటుడిగా, ఇటు నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి నిర్మాతగా, మరోవైపు విమానయాన రంగంలో ఏకంగా విమానాల సంస్థనే ఏర్పాటు చేసి ఓ వ్యాపారవేత్తగా మారిపోయాడు…

అయితే ఇప్పుడు ఏకులా వచ్చి మేకు అయ్యాడనే సామేతను కాకుండా… తండ్రి వారసత్వంతో వచ్చి తండ్రినే మించిపోయేలా దూసుకుపోతున్నాడు రామ్చరణ్… రామ్ చరణ్ గురించి ఇంత ఉపోద్ఘాతం అవసరమనుకుంటున్నారా… ఇంత ఎందుకనుకుంటున్నారా… అయితే మీరే చూడండి… ఇతగాడు ఏమి చేశాడో… సాహో సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. అయితే ఈ సాహో సినిమాలో రామ్ చరణ్ పెట్టుబడి పెట్టాడట.. ఇది నమ్మలేని నిజం… కానీ నమ్మక తప్పదు మరి…. అంటే చూడండి రామ్ చరణ్ తెలివి…

తన తండ్రితో సైరా సినిమా తీస్తూనే మరోవైపు సాహో సినిమాలోనూ పెట్టుబడులు పెట్టి తన వ్యాపారాన్ని ఎలా పదిలంగా కాపాడుకుంటున్నాడో… యూవీ క్రియోషన్లో తనకున్న స్నేహితుల ద్వారా సాహో హీరో యంగ్ రెబల్స్టార్ ప్రభాస్తో ఉన్న ఆత్మీయతతో సాహో సినిమా కు ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు తానే ఆదుకున్నాడట… అంటే అటు స్నేహితులకు సాయం చేసినట్లు.. ఇటు ప్రభాస్తో స్నేహం నిలుపుకుని కేరీర్ను నిలిపినట్టు… మరోవైపు తన ఆర్థిక వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నట్లు… అంటే స్నేహానికి స్నేహం… పైసలకు పైసలు.. భళే తెలివి మంతుడు కదా రామ్ చరణ్…

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news