Gossipsక్రికెటర్ బయోపిక్ లో తాప్సీ.. అదిరిపోయే ఛాన్స్..!

క్రికెటర్ బయోపిక్ లో తాప్సీ.. అదిరిపోయే ఛాన్స్..!

తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైన తాప్సీ పన్ను ఈమధ్య తెలుగులో పెద్దగా సినిమాలు చేయట్లేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస హిట్లు కొడుతుంది. 2 ఇయర్ బ్యాక్ ఆనందో బ్రహ్మ అంటూ అలరించిన తాప్సీ రీసెంట్ గా వచ్చిన గేం ఓవర్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. డిఫరెంట్ సబ్జెక్టులను చేస్తూ సక్సెస్ ఫుల్ కెరియర్ సాగిస్తున్న తాప్సీ ఇప్పుడు క్రికెటర్ గా కనిపించనుంది.

మహిళా క్రికెటర్, భారత మహిళా క్రికెట్ జట్టుకు సారధ్యం వహించిన మిథాలి రాజ్ బయోపిక్ కథా చర్చల్లో ఉంది. ఆమె బయోపిక్ తీసేందుకు బాలీవుడ్ లో వర్క్ మొదలైంది. ఈ బయోపిక్ లో ముందు ఎవరెవరినో హీరోయిన్ గా అనుకోగా ఫైనల్ గా ఆ ఛాన్స్ తాప్సీని వరించిందని తెలుస్తుంది. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో ఫుల్ ఫాం లో ఉన్న తాప్సీకి ఇదో లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.

మిథాలి రాజ్ మహిళా క్రికెట్ కు వన్నె తెచ్చిన ప్లేయర్. రీసెంట్ గా ఆ సినిమాలో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా అన్న తాప్సీకి ఈ ఛాన్స్ వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే తమిళంలో కణా సినిమాలో ఐశ్వర్యా రాజేష్ క్రికెటర్ గా కనిపించి అలరించింది. ఆ సినిమాను తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి గా రీమేక్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news