Gossips2 కోట్ల కోసం సమంత ఇంత కష్ట పడుతుందా..!

2 కోట్ల కోసం సమంత ఇంత కష్ట పడుతుందా..!

అక్కినేని సమంత ప్రస్తుతం తను నటించిన ఓ బేబీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. సినిమాలో సీనియర్ నటి లక్ష్మి కూడా నటించింది. నాగ శౌర్య కూడా సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యత అంత మీద వేసుకుంది సమంత. సినిమాలో నాగ శౌర్య ఉన్నా సరే సమంత మీదే ఎక్కువ ఫోకస్ ఉంది.

సినిమా కథ కూడా హీరోయిన్ కు ప్రాధాన్యత ఉంది అనుకోండి. అయితే ఈ సినిమాకు సమంత ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పెళ్లి తర్వాత బిజినెస్ పడిపోయింది అనుకున్న వారందరికి షాక్ ఇస్తూ ఓ బేబీ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుంది. కొరియన్ మూవీని 10 కోట్లకు కొన్న సురేష్ బాబు రీమేక్ లో సమంత నటింప చేయడానికి 2 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారట.

అందుకే అమ్మడు ప్రమోషన్స్ బాధ్యత మీద వేసుకుందని తెలుస్తుంది. అయితే యువ హీరో నాగ శౌర్యకు అన్యాయం జరుగుతుందని చెప్పాలి. కేవలం సమంత మీదే ప్రమోస్ కట్ చేసి ఆమెను హైలెట్ చేస్తున్నారు. కేవలం నందిని రెడ్డి మీద ఉన్న అభిమానం కొద్ది నాగ శౌర్య ఈ సినిమా చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి అక్కినేని కోడలిగా సమంత సినిమాల పరంగా చెలరేగి పోతుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news