అజ్ఞాతంలోకి తారక్, చరణ్.. షాక్‌లో ఫ్యాన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం కోసం సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులు చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఇటీవల సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను జక్కన్న తెరకెక్కించాడు. కాగా ఇప్పుడు ఈ సినిమా పుణ్యమా అని హీరో తారక్, చరణ్‌లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంతకీ ఈ స్టార్ హీరోలు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు మేటర్‌లో తెలుసుకుందాం.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ మూవీలో కొన్ని ముఖ్యమైన సీన్స్ కోసం తమిళనాడులోని ఓ రహస్య ప్రదేశానికి వెళ్లారు చిత్ర యూనిట్. చరణ్, తారక్‌ల మధ్య నడిచే ఓ ఆసక్తికర అంశాన్ని ఇక్కడ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకే ముఖ్యమైన ఓ ఇంట్రెస్టింగ్ సీక్వె్న్స్‌ను ఇక్కడే పూర్తి చేయనున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ చిత్ర షూటింగ్ ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని చిత్ర యూనిట్ అత్యంత సీక్రెట్‌గా పెట్టింది. కాగా హీరోలు ఎక్కడికి వెళ్లారా అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

అయితే హీరోలు షూటింగ్ నిమిత్తం సేఫ్ ప్లేస్‌కు వెళ్లినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఎక్కడికి వెళ్లారనే విషయాన్ని త్వరలో రివీల్ చేస్తామని అన్నారు. దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 2020లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a comment