సిగరెట్‌తో రకుల్.. క్లాస్ పడిందిగా!

అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మన్మధుడు 2’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాతో నాగ్ మరో బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమని అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్‌ తన పాత్ర కారణంగా ట్రోలింగ్‌కు గురవుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఓ సీన్‌లో రకుల్ సిగరెట్ కాలుస్తూ కనిపిస్తుంది. అయితే ఇదే సీన్ అమ్మడి ట్రోల్స్‌కు కారణమైంది. రకుల్ ఇలా సిగరెట్ తాగి ఏం చెప్పాలనుకుంటోంది అంటూ ట్రోలర్లు ఆమెను ఓ చెడుగుడు ఆడుతున్నారు. అయితే వారందరీ కలిపి రకుల్ ఒక క్లాస్ పీకింది. తన పాత్ర అవంతిక చిత్రంలో సిగరెట్ తాగే సీన్ ఉంది కాబట్టి తాను అలా చేశానని.. సినిమా వేరు నిజజీవితం వేరు అంటూ చెప్పుకొచ్చింది. సినిమా పూర్తిగా చూస్తేనే.. అవంతిక సిగరెట్ ఎందుకు కాల్చిందో తెలుస్తుందని.. ఊరికే కూర్చొని ట్రోల్స్ చేయడం మానేసి ఏదైనా పనికొచ్చే పని చేయమంటూ ట్రోలర్స్‌కు గట్టి క్లాస్ పీకింది.

అయితే సినిమాను సినిమాలా చూడాలని సజెస్ట్ చేస్తున్నారు క్రిటిక్స్. అంతేగాని సినిమాను పర్సనల్ లైఫ్‌కు లింక్ చేయవద్దంటూ రకుల్ వారికి వార్నింగ్ ఇచ్చింది. ఏదేమైనా సినిమాలో చేసింది సినిమా వరకే పరిమితం చేయాలని ఆమె కోరుతోంది.

Leave a comment