ఎట్ట‌కేల‌కు నాగార్జున హీరోయిన్‌కు పెళ్లైంది..

1993లో మిస్‌ ఇండియాగా ఎంపికైన పూజా బాత్రా తెలుగు సినిమాలో కూడా న‌టించింది. తెలుగులో త‌న తొలి సినిమాలో అరుణ్ కుమార్ హీరోగా గ్రీకువీరుడులో న‌టించింది. ఆ త‌ర్వాత సిసింద్రీ చిత్రంలో నాగార్జున ప‌క్క‌న త‌న అంద‌చందాల‌తో ఆడిపాడి అంద‌రిని అల‌రించింది. అయితే ఆమె తొలి వావాహిక
జీవితం అంత సాపీగా జ‌ర‌గ‌లేదు. 2011లోనే తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత తాజాగా ఇప్పుడు మ‌రో పెళ్లి చేసుకుంది.

త‌న స్నేహితుడు, నటుడు నవాబ్‌ షాను పెళ్లి చేసుకున్నానని పూజా బాత్రా పేర్కొన్నారు. నవాబ్‌ షా భాగ్ మిల్కా భాగ్‌, లక్ష్యా తదితర చిత్రాలలో నటించాడు. కొన్నిరోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట గత వారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సన్నిహితుల ఆధ్వర్యంలో ఆర్యసమాజ్‌లో నిరాడంబరంగా త‌మ‌ పెళ్లి జరిగింది ఆమె తెలిపారు.

ఈ క్రమంలో పూజా బాత్రా తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోమవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. నవాబ్‌ను ఇష్టపడుతున్నాని తెలిసిన తర్వాత పెళ్లికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావని నా స్నేహితులు తరచూ అడిగేవారు…. అయితే తనని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వివాహ బంధంలో అడుగుపెట్టాలనుకున్నాన‌ని ఆమె తెలిపారు. మొద‌టిటి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చాక చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఆమె మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు.

Leave a comment