Gossipsసినిమాల దెబ్బకు వేట మొదలుపెట్టిన నివేథా

సినిమాల దెబ్బకు వేట మొదలుపెట్టిన నివేథా

నాని నటించిన జెంటిల్‌మెన్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా హిట్ కావడానికి పెద్ద రీజన్ నివేథా థామస్ అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ సినిమాలో అమ్మడి పర్ఫార్మెన్స్ అలాంటిది మరి. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేస్తోన్న ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల దెబ్బకు వేట మొదలుపెడుతోంది. ఇంతకీ అమ్మడు ఏం వేట చేస్తుందో తెలియాలంటే మేటర్‌లోకి వెళ్లాల్సిందే.

తాజాగా బ్రోచేవారెవరురా అనే సినిమాతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న నివేథా చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. అయితే వాటి షూటింగ్ నిమిత్తం ఈ మలయాళీ గుమ్మ తరుచూ హైదరాబాద్‌కు వస్తూ వెళుతోంది. హోటళ్లలో దిగడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న ఈ బ్యూటీ హైదరాబద్‌లో తనకంటూ ఓ సొంత నివాసం కోసం చూస్తోందని తెలుస్తోంది. అయితే ఆమె తన సొంత ఇళ్లు చూస్తుందా లేక అద్దె ఇంటి కోసం చూస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
ఏదేమైనా హైదరాబాద్‌లో తన వేట ఎలా ముగుస్తోంది అని నివేథా థామస్ టెన్షన్ పడుతోందని తెలుస్తోంది. ఏదేమైనా ఈ బ్యూటీకి ఒక చక్కటి ఇల్లు దొరకాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news