మ‌న్మ‌థుడు 2 “మీట్ అవంతిక” ట్రైలర్..

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున న‌టించిన మ‌న్మ‌థుడు సినిమా అత‌డి కెరీర్‌లోనే తిరుగులేని రొమాంటిక్ ఇమేజ్ ఇచ్చింది. 2002లో వ‌చ్చిన మ‌న్మ‌థుడు సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న మ‌న్మ‌థుడు 2 సినిమా స్టిల్స్‌, లుక్స్‌, టీజ‌ర్ల‌తో నాగ్ ఇప్ప‌టికే ర‌చ్చ చేస్తున్నాడు. తాజాగా మీట్ అవంతిక పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అవంతికగా న‌టిస్తోన్న ర‌కుల్ ప్రీత్‌సింగ్ సీన్ల‌కు సంబంధించి రిలీజ్ చేసిన ఈ వీడియో సినిమాపై మ‌రింత అంచ‌నాలు పెంచేసింది.

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్ అవంతిక‌గా న‌టిస్తోంది. చూడ‌డానికి చాలా ప‌ద్ధ‌తిగా క‌నిపిస్తోన్న ర‌కుల్‌… చాటుమాటు వ్య‌వ‌హారాలు చాలానే చేస్తుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టిదాకా యు సర్టిఫికెట్ చూపించాను… ఇప్పుడు ఏ స‌ర్టిఫికెట్ చూపిస్తా అంటూ నాగ్‌ను ఆడుకుంటోంది. చివ‌ర్లో ర‌కుల్ సిగ‌రెట్ కూడా పీకేసింది. ఓవ‌రాల్‌గా చూస్తే ఈ ఏజ్‌లో ల‌వ్ ఫెయిల్యూర్ అయితే నువ్వు త‌ట్టుకోలేవురా అన్న డైలాగ్ కూడా నాగ్ మిడిల్ ఏజ్‌లో ల‌వ్‌లో ప‌డ‌తాడ‌న్న‌ది స్ప‌ష్టంగా చెప్పేస్తోంది.

ర‌కుల్ చాలా సంప్ర‌దాయంగా ఉంటుంద‌ని నాగ్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ సెల‌క్ట్ చేస్తే ఆమె ఆ త‌ర్వాత త‌న మోడ్ర‌న్ స్టైల్ మొత్తం బ‌య‌ట పెట్ట‌డంతో వాళ్లు షాక్ అవుతారు. ఏదేమైనా సినిమాలో అదిరిపోయే రొమాన్స్ ఉంటుంద‌ని అర్థ‌మైంది. మ‌రి ఆరు ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అవుతోన్న నాగ్ మ‌న్మ‌థుడు 2గా ఎలా ర‌చ్చ చేస్తాడో ? చూడాలి.

Leave a comment