Moviesఇస్మార్ట్ శంకర్ కలక్షన్ల సునామి.. పూరి హిట్ కొడితే ఇలానే ఉంటుందా..!

ఇస్మార్ట్ శంకర్ కలక్షన్ల సునామి.. పూరి హిట్ కొడితే ఇలానే ఉంటుందా..!

కరెక్ట్ సినిమా పడితే ఎవరి సత్తా ఏంటన్నది తెలుస్తుంది. 13 ఏళ్ల కెరియర్ 17 సినిమాలు చేసినా ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ గా ఇస్మార్ట్ శంకర్ తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. జూలై 18న రిలీజైన ఈ సినిమా వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ముఖ్యంగా తెలుగులో కొన్నాళ్లుగా క్లాస్ మూవీస్, ప్రయోగాత్మక సినిమాలు వస్తుండగా పక్కా మాస్ మసాలా మూవీగా ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ ల గ్లామర్ షో కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. లాస్ట్ థర్స్ డే రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ మొదటి 3 రోజుల్లోనే లాభాల బాట పట్టింది.

ఐదవ రోజైన సోమవారం కూడా 2.17 కోట్ల షేర్ తో దుమ్ముదులిపేస్తుంది. ఇప్పటివరకు 22.40 కోట్లతో ఇస్మార్ట్ శంకర్ అదరగొడుతున్నాడు. మరో వారం దాకా ఈ కలక్షన్స్ ఇలానే ఉంటే 50 కోట్ల మార్క్ క్రాస్ చేసేలా ఉంది. ఏరియా వైజ్ ఇస్మార్ట్ శంకర్ కలక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 9.79 కోట్లు

సీడెడ్ : 3.70 కోట్లు

ఉత్తరాంధ్ర : 2.62 కోట్లు

ఈస్ట్ : 1.46 కోట్లు

వెస్ట్ : 1.17 కోట్లు

కృష్ణా : 1.45 కోట్లు

గుంటూరు : 1.47 కోట్లు

నెల్లూరు : 0.74 కోట్లు

ఏపి/తెలంగాణ : 22.40 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news