ఆమెతో అక్రమ సంబంధం ఉందని ఒప్పుకున్న స్టార్ హీరో..!

బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను చేసిన ప్రతి సినిమాలో ముద్దు సీన్స్ హంగామా ప్రేక్షకులను అలరిస్తాయి. బోల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఇమ్రాన్ హష్మి ఈమధ్య కాస్త వెనుకపడ్డాడు. ఇక రీసెంట్ గా ఓ టాక్ షోలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మి తను చేసిన చెడ్డ పనుల గురించి కూడా చెప్పుకొచ్చాడు.

పెళ్లి కాకముందు తను ఓ పెళ్లైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా అని.. అయితే ఆమెతో రిలేషన్ లో ఉన్న టైంలో ఆమెకు పెళ్లైన సంగతి తనకు తెలియదని.. ఆమె కూడా తనకు చెప్పలేదని అన్నాడు. తన జీవితంలో చేసిన ఓ పెద్ద పొరపాటు అదే అని.. తన భార్య అలా చేస్తే చంపేసేవాడినని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశాడు ఇమ్రాన్ హష్మి.

కెరియర్ పరంగా కాస్త వెనుకపడ్డ ఇమ్రాన్ మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. బాలీవుడ్ లో ఇమ్రాన్ సినిమాలకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో కుర్ర హీరోలు వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. అందుకే ఇమ్రాన్ కు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఎంత టాక్ షో అయినా ఇమ్రాన్ ఇలా తన అక్రమ సంబంధం గురించి చెప్పడం అందరిని ఆశ్చర్యపరచింది.

Leave a comment