ప్ర‌పంచక‌ప్ ఫైన‌ల్ ఆ రెండు జట్ల మ‌ధ్యే పోరు..!

ఇంగ్లాండ్‌లో నెలన్నర రోజులుగా జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నీ లీగ్ స్థాయిని దాటి నాకౌట్ దశకు చేరుకుంది. మొత్తం పది వికెట్లు పాల్గొన్న ఈ టోర్నీలో లీగ్ దశలో ఆరు జ‌ట్లు ఇంటికి వెళ్లిపోయాయి. ఇప్పుడు సెమీఫైనల్లో నాలుగు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మంగళవారం జరిగే తొలి సెమీ ఫైనల్‌లో ఇండియా, న్యూజిలాండ్ తోనూ, గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.

టోర్నీలో లీగ్ స్టేజ్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య సెమీస్ పోరు జ‌రుగుతుండడంతో ఎవరు ?గెలుస్తారు ఎవరు ? ఓడతారు అన్న దానిపై ఆసక్తికర చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ నాలుగు జట్టులో ఫైనల్ గా ప్రపంచ కప్ ఎవ‌రు ముద్దాడుతారు? ఎవరికి అర్థం కావడం లేదు. గ్రూప్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న ఈ నాలుగు జట్లు కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయాయి.టోర్నీ ముందు బీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల‌లో ఓడింది. న్యూజిలాండ్ చివరి మూడు మ్యాచ్‌ల‌లోనూ ఓడిపోయింది. ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ ల్లో ఓడితే… టోర్నీ అంతటా జోరు కొనసాగించిన ఇండియా ఇంగ్లాండ్ చేతిలో ఒక్క మ్యాచ్‌లో మాత్ర‌మే ఓడింది.

ఓల్డ్ ట్రాఫోర్డ్ లో రేపు జరగనున్న తొలి సెమీస్‌లో ఇండియా, న్యూజిలాండ్ – గురువారం ఎడ్జ్ బాస్టన్ లో జరగనున్న రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఆడ‌నున్నాయి. గెలుపు ఓట‌ముల‌పై ఎవ‌రి అంచ‌నాలు వాళ్ల‌కు ఉన్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రెవ‌రు ఫైన‌ల్ ఆడ‌తారో ? అన్న‌దానిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ జోస్యం చెప్పాడు.

తొలి సెమీస్‌లో ఇంగ్లండ్ కీవీస్‌ను ఇంటికి పంపిస్తుంద‌ని… సెకండ్ సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఓడిస్తుందని పీటర్సన్ చెప్పాడు. ఆదివారం లండన్‌లో జ‌రిగే ఫైన‌ల్లో ఇండియాను ఓడించే జ‌ట్టే ప్ర‌పంచ‌క‌ప్ సొంతం చేసుకుంటుంద‌ని ట్వీట్ చేశాడు. పీట‌ర్స‌న్ ట్వీట్‌ను బ‌ట్టి ఇంగ్లండ్ క‌ప్ గెలుస్తుంద‌ని త‌న లెక్క‌లు త‌న‌కు ఉన్నా ఫైన‌ల్‌గా ఈ మూడు మ్యాచ్‌ల‌లో ఒత్తిడిని అధిగ‌మించి బాగా ఆడిన‌జ‌ట్టే గెలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

Leave a comment