Gossipsఆ హీరోయిన్ కోసం పట్టు పడుతున్న అల్లు అర్జున్..!

ఆ హీరోయిన్ కోసం పట్టు పడుతున్న అల్లు అర్జున్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ క్రేజీ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి హిట్ అందుకున్నాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు మంచి పాత్ర పోశిస్తుంది.

ఇక ఈ సినిమా కథ ప్రకారం మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. ఆ పాత్ర కోసం హీరోయిన్ ను వెతుకుతున్న త్రివిక్రం కు నివేదా పేతురాజ్ ను రిఫర్ చేశాడట అల్లు అర్జున్. తమిళంలో ఇప్పటికే టాలెంట్ ప్రూవ్ చేసుకున్న నివేదా పేతురాజ్ తెలుగులో మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె టాలెంట్ చూసి ఇంప్రెస్ అయిన బన్ని ఎలాగైనా నివీదాకు తన సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడట.

ఎలాగు నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు కాబట్టి బన్ని కోరిక మేరకే నివేదా పేతురాజ్ సినిమాలో ఉంటుందని చెప్పొచ్చు. కచ్చితంగా నివేదాకు ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. సినిమా హిట్ పడితే నివేదా పేతురాజ్ కు తెలుగులో కూడా వరుస ఛాన్సులు రావడం ఖాయం. అలకనంద, నేను నాన్న టైటిల్స్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా ముందు ఈ ఇయర్ దసరాకి రిలీజ్ అనుకున్నా ఇప్పుడు 2020 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news