Moviesబన్నీ-త్రివిక్రమ్ మూవీ..టెన్షన్లో ఫ్యాన్స్?

బన్నీ-త్రివిక్రమ్ మూవీ..టెన్షన్లో ఫ్యాన్స్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జులాయి, సన్నాఫ్ కృష్ణమూర్తి లాంటి హిట్ సినిమాలు తీసిన ఈ కాంబినేషన్ మరో హిట్ కోసం గట్టి పట్టుమీదే ఉన్నారు. కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఓ భయం పట్టుకుందట. అందుకు కారణం త్రివిక్రమ్ అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా అల్లు అర్జున్ ఈ సినిమాకి డబ్బింగ్ కూడా మొదలుపెట్టాడు.

ఇప్పటి వరకు టైటిల్ కూడా ఫిక్స్ చేయని ఈ మూవీపై ఫ్యాన్స్ కి రక రకాల సందేహాలు మొదలయ్యాయట. ఆ భయానికి కారణం ఇది బన్నీ త్రివిక్రమ్ కలయికలో మూడో సినిమా కావడమే. మెగా హీరోలతో త్రివిక్రమ్ తీసిన మూడో సినిమా ఫ్లాప్ కావడమే అందుకు కారణం. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో రెండు బ్లాక్ బస్టర్స్ తీసిన త్రివిక్రమ్ ఆ మద్య ‘అజ్ఞాతవాసి’లాంటి ఘోరమైన డిజాస్టర్ అందించారు.

ఇప్పుడు బన్నీతో కూడా త్రివిక్రమ్ ది మూడో సినిమా కాబట్టి, అల్లు అర్జున్‌తో తీస్తున్న ఈ సినిమా కూడా పోతుందేమో అనే భయంలో బన్ని ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇలాంటి సెంటిమెంట్ కి బాగా విలువ ఇస్తుంటారు..మరీ వీరిద్దరి కాంబినేషన్ వచ్చే సినిమా హిట్టా..ఫట్టా అన్న విషయంపై తెగ టెన్షన్ పడిపోతున్నారు మెగా ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news