సాహో వర్సెస్ సైరా.. ఎవరి దమ్మెంత..?

బాహుబలి సినిమాతో సాహో స్టార్ ప్రభాస్ నేషనల్ వైడ్ గా పిచ్చ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ గా చిరు ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాడు. పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఖైది నంబర్ 150తో మంచి విజయం అందుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారింది. అందుకే సాహో సినిమాకు నేషనల్ వైడ్ గా క్రేజ్ పెరిగింది.

ఈ ఇయర్ రాబోతున్న ఈ రెండు భారీ సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. అదేంటి రెండు సినిమాలు వేరు వేరు డేట్లలో కదా రిలీజ్ అయ్యేది మరి అలాంటప్పుడు ఎలా పోటీ ఉంటుందని అనుకోవచ్చు. ప్రభాస్ సాహో ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు. చిరంజీవి సైరా మూవీ అక్టోబర్ 2న రిలీజ్ అంటున్నారు. అయితే ఈ రెండు సినిమాల బిజినెస్ లో గట్టి పోటీ ఏర్పడింది.

సాహో సినిమా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడుతుంది.. ఇంచుమించు సైరా సినిమా కూడా అదే రేంజ్ బడ్జెట్ తో వస్తుంది. బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెండు సినిమాల మధ్య బిజినెస్ పోటీ ఉంది. సైరా కర్ణాటక రైట్స్ 31 కోట్లకు అమ్ముడవగా ఓవర్సీస్ రైట్స్ 70 కోట్ల దాకా పలికాయట. సాహో కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా 350 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఎలా లేదన్నా సైరా వర్సెస్ సాహో ఒకదాన్ని మించి మరోటి హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాయి. ఎలా చూసుకున్నా సరే సిని లవర్స్ కు ఇది బెనిఫిట్ అని చెప్పొచ్చు.

Leave a comment