పూరీని న‌మ్ముకున్న ఛార్మీకి ఏం మిగిలింది…

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు ఒకప్పుడు యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. పూరి సినిమాలలో హీరో క్యారెక్టర్లతో యూత్ తమను పోల్చుకునే వాళ్ళు. ఎన్టీఆర్ టెంపర్ సినిమా తర్వాత పూరి వరుసపెట్టి డిజాస్ట‌ర్ల మీద డిజాస్ట‌ర్లు తీస్తున్నాడు. పూరి ఏకంగా డిజాస్టర్ లలో డబుల్ హ్యాట్రిక్‌ కొట్టడంతో ఇప్పుడు అతని మార్కెట్ పూర్తిగా పడిపోయింది. పూరి సినిమాల్లో హీరోలు అంతా చాలా పోరంబోకులుగా ఉండ‌డంతో ఒకప్పుడు అతడిసినిమాలంటే యూత్ కు పిచ్చ‌గా న‌చ్చేవి. అయితే ఎప్పుడూ అదే ట్రెండ్ కంటిన్యూ చేయ‌డంతో పూరి హిట్ అనే మాటే ఐదేళ్లుగా మ‌ర్చిపోయాడు.

ఇక హీరోయిన్ గా కెరీర్ ముగిసిన సమయంలో హీరోయిన్ ఛార్మి, పూరి జతకు చేరింది. ప్రస్తుతం పూరి ఛార్మి ఇద్దరూ పార్టనర్స్ గా సినిమాలు నిర్మిస్తున్నారు. పూరి తనయుడు ఆకాష్ సినిమా మెహబూబా కోసం ఛార్మి పెట్టిన డ‌బ్బంతా గంగ‌పాలైంది. దీంతో ఇటు పూరీది కూడా అదే ప‌రిస్థితి. తాజాగా రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పూరీ, ఛార్మీ ఆశ‌లు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి.

ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ త‌ర్వాత చూస్తే భారీ లాభాలు లేక‌పోయినా ఛార్మీ మోహ‌బూబా సినిమాతో పోగొట్టుకున్న‌దంతా ఈ సినిమాతో పూరీ వ‌చ్చేలా చేశాడ‌ని ట్రేడ్ టాక్‌. అయితే ఇస్మార్ట్ హిట్ అయితేనే వీళ్ల‌కు ఈ డ‌బ్బు మిగులుతుంది. అది కూడా డిజాస్ట‌ర్ అయితే మ‌ళ్లీ అడ్వాన్స్‌లు రిట‌ర్న్‌లు ఇవ్వ‌డాలు… మ‌ళ్లీ సినిమా తీసి క‌వ‌ర్ చేయ‌డాలు గట్రా ఉంటాయ్‌. మ‌రి ఇస్మార్ట్‌గా హిట్ ఇచ్చి ఛార్మీ ఆనందాన్ని పూరీ కంటిన్యూ చేస్తాడా ? లేదా ? అన్న‌ది 18న తేలిపోనుంది.

Leave a comment