నిర్మాతలను భయపెడుతున్న బోయపాటి..!

స్టార్ డైరక్టర్ బోయపాటి శ్రీనుకి ప్రస్తుతం ఏమాత్రం కాలం కలిసి రావట్లేదని చెప్పొచ్చు. రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమా తీసిన బోయపాటి శ్రీను ఆ తర్వాత అతని సినిమా అంటేనే హీరోలు భయపడేలా చేస్తున్నాడు. హీరోలే కాదు నిర్మాతలు కూడా బోయపాటితో సినిమా అంటే భయపడుతున్నారు. దీనికి కారణం ఆయన బడ్జెట్ అని తెలుస్తుంది. వి.వి.ఆర్ సినిమా తర్వాత బాలకృష్ణతో సినిమా ఎనౌన్స్ చేశారు బోయపాటి.

ఫిబ్రవరిలోనే మొదలవ్వాల్సిన ఆ సినిమా ఇంకా ముహుర్తం పెట్టలేదు. ముందు బాలకృష్ణ ఈ సినిమా నిర్మించాలని అనుకున్నా అనివార్య కారణాల వల్ల సినిమా ఆయన నిర్మించడానికి ఒప్పుకోలేదు. అయితే మధ్యలో దిల్ రాజు ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్ట్ చూపించాడు. సింహా, లెజెండ్ సినిమాలు హిట్ అవడంతో దిల్ రాజు బోయపాటి తో సినిమా చేద్దామని అనుకున్నాడు. కాని బడ్జెట్ 70 కోట్లు అనేసరికి ఆయన వెనక్కి తగ్గాడు.

బాలకృష్ణతో 70 కోట్ల ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అవదని భావించి దిల్ రాజు సారీ అని చెప్పాడట. అంతేకాదు ఒకరిద్దరు నిర్మాతలది ఇదే పరిస్థితి అని తెలుస్తుంది. భద్ర నుండి వి.వి.ఆర్ వరకు తన సినిమాలతో అలరించిన బోయపాటి స్టార్ డైరక్టర్ గా సత్తా చాటాడు. కాని అతని సినిమాకు నిర్మాతలు కరువవడం ఆశ్చర్యకరమని చెప్పాలి.

Leave a comment