నితిన్‌కు తీవ్ర గాయం… ఏం చేయ‌లేక‌పోతున్నాడా…

ఈ ఫొటో చూసి వామ్మో నితిన్‌కు మ‌ళ్లీ గాయ‌మైందా ? అని టెన్ష‌న్ ప‌డుతున్నారా ? అదేం కాదులెండి. నితిన్‌కు ఈ గాయం అయ్యింది ఇప్పుడు కాదు.. కొన్ని నెలల క్రితందే ఈ ఫొటో. నితిన్ భుజానికి అయిన ఈ గాయం కార‌ణంగానే ‘భీష్మ’ సినిమా ప్రారంభం ఆలస్యమైంది. మొత్తానికి గాయం నుంచి కోలుకుని ప్రస్తుతం ‘భీష్మ’ షూటింగ్‌లో నితిన్ బిజీగా ఉన్నారు. భీష్మ త‌ర్వాత నితిన్ వ‌రుస‌గా రెండు సినిమాల‌ను లైన్లో పెడుతున్నాడు.

ఇదిలా ఉంటే త‌న‌కు అయిన గాయం గురించి నితిన్ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. రెండు నెల‌ల్లోనే నితిన్ ఏకంగా 12 కేజీల బ‌రువు త‌గ్గాడ‌ట‌. ఇంత‌కు నితిన్‌కు అంత బ‌రువు త‌గ్గాల్సిన అవ‌స‌రం ఎందుకు వ‌చ్చింది ? అనే ప్ర‌శ్న కూడా త‌లెత్తుతుంది. గాయం కార‌ణంగా రెండు నెల‌లు విశ్రాంతి తీసుకోవ‌డంతో మ‌నోడు ఒక్క‌సారిగా బ‌రువు పెరిగిపోయాడ‌ట‌.

ఈ క్ర‌మంలోనే తిరిగి బ‌రువు త‌గ్గేందుకు ఎన్నో క‌స‌ర‌త్తులు చేశాన‌ని… ఈ విషయంలో నా జిమ్ ట్రైనర్ వంశీకి తప్పకుండా కృతజ్ఞతలు తెలపాలని నితిన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక భీష్మ త‌ర్వాత నితిన్ చంద్రశేఖర్ ఏలేటితో సినిమాతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంతో ‘రంగ్ దే!’ సినిమాను చేస్తున్నారు.

‘భీష్మ’లో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్ కాగా చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ‘రంగ్ దే!’లో కీర్తి సురేష్ హీరోయిన్.

Leave a comment