నయనతారకు ఎసరు పెడుతున్న సమంత.. అక్కినేని కోడలా మజాకా..!

సౌత్ లో క్రేజీ స్టార్స్ గా ఉన్న నయనతార, సమంతల మధ్య ఇప్పుడు గట్టి పోటీ ఏర్పడ్డది. కోలీవుడ్ లో స్టార్ హీరోల రేంజ్ లో నయనతార సినిమాలు ఆడుతున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నయనతార సరికొత్త క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆమెకు అనూహ్యంగా సమంతతో పోటీ ఏర్పడింది. దాదాపుగా నయనతార రేంజ్ లోనే సమంతకు సౌత్ లో ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసింది.

అయితే పెళ్లి తర్వాత సమంత తన పంథా మార్చేసింది. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. యూటర్న్, ఓ బేబీ సినిమాలు ఆ కోవలో వచ్చినవే. సమంత తీసుకున్న ఈ కొత్త స్టెప్ తో ఇతర హీరోయిన్స్ అవకాశాలు కూడా ఆమెకు వస్తున్నాయి. కోలీవుడ్ లో నయనతార హీరోయిన్ గా అరమ్ సినిమా తీశాడు గోపీ నరైన్. తెలుగులో ఆ సినిమా కర్తవ్యం అంటూ వచ్చింది.

ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ గా అరమ్ 2 చేస్తున్నారు. ముందు నయనతార అనుకున్న ఆ సినిమాలో సమంత వచ్చి చేరింది. ప్రస్తుతం కోలీవుడ్ లో నయనతారకు బ్యాడ్ టైం నడుస్తుంది. ఆమె చేసిన ఈమధ్య సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అందుకే ఆమె ప్లేస్ లో సమంత అయితే బెటర్ అని భావిస్తున్నారు. నయనతార చూపించిన బాటలోనే వెళ్తూ ఆమె స్థానానికే ఎసరు పెట్టింది సమంత. చూస్తుంటే లేడీ సూపర్ స్టార్ టైటిల్ ను కూడా నయన్ నుండి లాక్కునేలా ఉంది సమంత.

Leave a comment