సరిలేరు నీకెవ్వరు విజయశాంతి రోల్ లీక్..!

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సరిలేరు నీకెవ్వరు టైటిల్ ఫిక్స్ చేశారు. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, జగపతి బాబు నటిస్తున్నారని తెలుస్తుంది. చాలా ఏళ్లుగా ముఖానికి మేకప్ వేసుకోని విజయశాంతి మహేష్ సినిమా కోసం మళ్లీ కెమెరాముందుకు రానుంది. ఇక సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో విజయశాంతి ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తారట.

విలన్ గా జగపతి బాబు నటిస్తున్నారట. ఆర్మీ మేజర్ గా మహేష్ రాయలసీమకు రాగానే అక్కడ పరిస్తితులు అక్కడ అతన్ని ఉండేలా చేస్తాయట. ఇదే సరిలేరు నీకెవ్వరు కథట. సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారట. సరిలేరు నీకెవ్వరు కచ్చితంగా మహేష్ కెరియర్ లో మరో లైన్ స్టోన్ మూవీ అవుతుందని చెబుతున్నాడట అనీల్ రావిపుడి. సినిమాలో స్టార్ కాస్ట్ కూడా భారీగా ఉండటం కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.

ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ సరసన కన్నడ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. తెలుగులో ఛలో, గీతా గోవిందం సినిమాలతో అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకోగా మొదటిసారి మహేష్ సరసన నటిస్తుండటం విశేషం. 2020 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment