మహేష్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న డైరెక్టర్

సినిమా ఇండస్ట్రీలో దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకునే పంతాన సెలెబ్రిటీలు తమ ఫేం ఉన్నప్పుడే ఇతర బిజినెస్‌లలో సత్తా చాటుతుంటారు. ఇది కేవలం చిన్నా చితక వారికే కాకుండా పెద్ద స్టా్ర్స్‌కి కూడా వర్తిస్తుంది. తెలుగులో మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కూడా ఇదే తరహాలో వీలైనంత వరకు బిజినెస్‌లలో తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ప్రొడక్షన్ రంగంలో మహేష్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ మల్టిప్లెక్స్‌ను తెరిచాడు మహేష్.

కాగా బిజినెస్‌లోనూ మహేష్ సక్సె్స్ ట్రాక్ చూసి అతడిని ఇన్‌స్పిరేషన్‌గా ఇతరులు అతడిని ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ కోవలోకి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వచ్చాడు. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్‌గా ఉన్న క్రేజ్‌తో ఇప్పుడు సొంతంగా బిజినెస్ మొదలుపెట్టాడు. ఇప్పటికే త్రివిక్రమ్‌కి హారిక అండ్ హాసిని ప్రొడక్షన్‌లో భాగం ఉన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా అయన తూర్పు గోదావరి జిల్లాలో ఓ ధియేటర్ కొన్నారట. దానిని ఆధునీకరించి ఒకరికి నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించారట.

ఇలా మహేష్‌ సక్సెస్‌తో స్పూర్తి పొందిన త్రివిక్రమ్ ఆయనను గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. అయితే మహేష్ మాదిరిగా సక్సెస్ అవుతాడా.. లేక దివాలా తీస్తాడా అనేది మాత్రం దేవుడికే వదిలేశాడు ఈ మాటల మాంత్రికుడు.

Leave a comment