Gossipsఏదేమైనా ఆమెని వదలనంటున్న డైరెక్టర్

ఏదేమైనా ఆమెని వదలనంటున్న డైరెక్టర్

ఇండస్ట్రీలో తమను ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్స్‌కు కొంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తారు మన సెలెబ్రిటీలు. ముఖ్యంగా స్టార్ స్టేటస్‌ వచ్చిన తరువాత వారిని పట్టించుకోవడం పూర్తిగా మానేస్తారు కొందరు. అయితే తనను ఇంట్రొడ్యూస్ చేశాడని ఓ డైరెక్టర్‌తో వరుసగా సినిమాలు చేసింది ఓ స్టార్ హీరోయిన్. కానీ అతడితో చేసిన చివరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయ్యింది. దీంతో ఆ డైరెక్టర్ ఏది ఏమైనా ఆ హీరోయిన్‌ను వదిలేది లేదు అంటూ సవాల్ విసురుతున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ గోలేంటో చూద్దామా.

దర్శకుడు తేజ కాజల్ అగర్వాల్‌ను టాలీవుడ్‌లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇంట్రొడ్యూ్స్ చేశాడు. ఆ తరువాత అమ్మడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తేజ కెరీర్‌ ఫేడవుట్ అవుతున్న సమయంలో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో మళ్లీ నటించిన ఈ బ్యూటీ ఆ సినిమా సక్సెస్‌తో తేజకు మళ్లీ లైఫ్ ఇచ్చింది. దీంతో వెంటనే మరోసారి సీత అనే సినిమాలో అమ్మడిని పెట్టుకున్నాడు తేజ. కానీ ఈసారి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ సినిమాగా సీత నిలిచింది. దీంతో ఇక తేజ-కాజల్ కాంబినేషన్ ముగిసినట్లే అనుకున్నారు అందరూ. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. మరో సినిమాతో వీరిద్దరు మనముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

ఇంకో విశేషమేమిటంటే.. ఈ సినిమాను స్వయంగా కాజల్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది. సీత ఫెయిల్యూర్‌ను పక్కనబెట్టి ఈ సినిమా కోసం సిద్ధం కావాల్సిందిగా కాజల్ స్వయంగా తేజను కోరిందట. అయితే తాను సీత విషయంలో చేసిన తప్పులను రిపీట్ కాకుండా చూసుకోవడానికి కొంత టైమ్ తీసుకుంటున్నాడు తేజ. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో మూవీ వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు సినీ లవర్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news