పెళ్లికి బైబై అంటూ ఫ్యాన్స్ కి షాక్..?

త‌క్కువ సినిమాల‌తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. మ‌ల్లూవుడ్ యంగ్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి. మాలీవుడ్‌లో మలర్‌ చిత్రంతో వికసించిన కథానాయకి ఈ అమ్మడు. ఆ చిత్రంలో టీచర్‌గా అందరినీ ఆకట్టుకున్న ఈ అమ్మడికి మాతృభాషతో పాటు దక్షిణాదిలోనే క్రేజ్‌ వచ్చేసింది. ఈ ఒక్క సినిమా దెబ్బ‌తో ఆమెకు సౌత్‌లో అన్ని భాష‌ల్లోనే వ‌రుస పెట్టి ఛాన్సులు వ‌చ్చేశాయి. తెలుగులో సాయిపల్లవి నటించిన ఫిదా చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది.

ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని తో నటించిన ఎంసీఏ సినిమా కూడా హిట్ అవడంతో టాలీవుడ్ లో సాయి పల్లవి పేరు మార్మోగింది. ఆ తర్వాత ఆమెకు ఇక్కడ స‌క్సెస్‌ రాలేదు. ఇక కోలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి. దయ, మారి 2, ఎన్జీకే ఈ మూడు సినిమాల్లో మారి 2 మినహా మిగిలిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాలో సాయి పల్లవికి రౌడీ బేబీ పాట చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఆమెకు ఛాన్సులు రావడం లేదు.

ఇదిలా ఉంటే తాజా ఇంట‌ర్వ్యూలో సాయి ప‌ల్ల‌విని నీ పెళ్ల‌ప్పుడు అని ప్ర‌శ్నిస్తే ఆమె షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది. హీరోయిన్‌ అన్న వారెవరికైనా ఎదురైయ్యే ప్రశ్న ఎవరినైనా ప్రేమించారా? పెళ్లి ఎప్పుడు? అన్నవే. పెళ్లి ప్ర‌శ్న‌పై ఆమె స్పందిస్తూ తాను పెళ్లి చేసుకోన‌ని.. పెళ్లి చేసుకుంటే త‌న త‌ల్లిదంద్రుల‌ను చూసుకోవ‌డం కుద‌ర‌ద‌ని తెగేసి చెప్పింద‌ట‌. ఇక ముందు నుంచి న‌ట‌న‌ను మాత్ర‌మే న‌మ్ముకుని గ్లామ‌ర్‌ను వ‌దిలేసిన సాయిప‌ల్ల‌వికి అవ‌కాశాలు త‌గ్గ‌డానికి మ‌రో కార‌ణంగా చెపుతున్నారు.

Leave a comment