10 నిమిషాల‌కే రికార్డులు బ్రేక్‌ చేసిన ‘ సాహో ‘ టీజ‌ర్‌…

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో టీజ‌ర్ వ‌చ్చీ రావ‌డంతోనే యూట్యూబ్‌లో వీరంగా ఆడేస్తోంది. రెండు సంవ‌త్స‌రాలుగా ఇండియ‌న్ సినిమా ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ ముందుగా ప్రకటింనట్టుగా గురువారం సరిగ్గా 11.23 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు. ‘బాహుబలి 2’ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహోపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఈ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా టీజ‌ర్ క‌ట్ చేశారు. 1.38 నిమిషాలు ఉన్న టీజ‌ర్ మొత్తం క‌ళ్లు చెదిరి మైండ్ బ్లాక్ అయ్యే యాక్ష‌న్ విజువ‌ల్స్‌తో నింపేశారు. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌కు ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీక్వెన్స్‌లతో హైప్ తీసుకువచ్చేదిగా ఈ టీజర్‌ను రూపొందించారు. తొలి 10 నిమిషాల‌కే సాహో టీజ‌ర్ యూ ట్యూబ్‌లో ఏకంగా 1.50 ల‌క్ష‌ల వ్యూస్‌ను రాబ‌ట్టి రికార్డులు బ్రేక్ చేసే దిశ‌గా దూసుకుపోతోంది.

ఇక విచిత్రం ఏంటంటే వ్యూస్‌తో పోటీగా లైక్స్ కూడా వ‌చ్చాయి. ఇప్ప‌టికే 86 వేల లైక్స్ రాబ‌ట్టుకున్న సాహో టీజ‌ర్ 3.8 వేల డిజ్‌లైక్స్ సొంతం చేసుకుంది. ‘బాధైనా హ్యాపీనెస్ అయినా నాతో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు..’ అని శ్రద్ధా చెప్పేడైలాగ్ తో టీజర్ మొదలైంది. టీజర్ చివరలో.. ప్రభాస్ ‘ఫ్యాన్స్.. డైహార్డ్ ఫ్యాన్స్’ అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

Leave a comment