‘ సాహో ‘ టీజ‌ర్ వచ్చేసిందోచ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కౌంట్‌డౌన్ లెక్క‌పెట్ట‌డం మొదలు పెట్టుకున్నారు. 2019 సంవత్సరంలో మోస్ట్ వెయిటెడ్ మూవీస్‌లో తొలి మూవీగా ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న సాహో టీజర్ రేపు రిలీజ్ అవుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్ల‌ర్‌పై దేశవ్యాప్తంగా అన్ని భాషల సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.ఇప్పటికే సాహో టీజర్ ఫైనల్ వెర్షన్ చెక్ చేసుకున్న‌ చిత్ర యూనిట్ మొత్తం కళ్ళు చెదిరిపోయే భారీ యాక్షన్ దట్టించి ఎడిట్ చేశారట. ప్రభాస్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని ఒక‌టి హీరోది అయితే …రెండోది విలన్ షేడ్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ విలన్ ఉండే రోల్ టోట‌ల్‌ సినిమాకే హైలెట్ కానుందట.

ఇక ఎవరు ఊహించని విధంగా టీజర్లోనే అదిరిపోయే ట్విస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. సినిమా మొత్తంగా ఉండే ట్విస్టుల్లో ఒకటో, రెండో టీజర్‌లో శాంపింల్‌గా చూపిస్తున్నార‌ట‌. ఇక టీజర్ ఖ‌చ్చితంగా ప్రభాస్ అభిమానులతో పాటు యాక్షన్ ప్రియుల‌తో పాటు ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడిని మెప్పిస్తుంద‌ని… టీజ‌ర్‌కు ఇప్పటికే ఇండస్ట్రీ ఇన్ సైడ్స్‌లో మంచి టాక్ వచ్చిందని తెలుస్తోంది. ఆగస్టు 15న సాహో సినిమా రిలీజ్ అవుతున్నందున టీజ‌ర్ ప్ర‌భావం బిజినెస్ మీద ఉండనుంది.
1
ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాహో ప్రి రిలీజ్ బిజినెస్ రూ.250 కోట్ల‌కు పైనే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. బాహుబ‌లి -ది కంక్లూజ‌న్ లాంటి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ రెండేళ్ల త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో బ‌య్య‌ర్ల‌కు కూడా సాహోపై మంచి గురి ఉంది. అందుకే భారీ ఎత్తున అడ్వాన్స్‌లు ఇస్తున్నారు. దిల్ రాజు నైజాం, ఉత్త‌రాంధ్ర‌కే రూ.42 కోట్లు అడ్వాన్స్ ఇచ్చందుకు రెడీ అయిన‌ట్టు కూడా వార్త‌లు వస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ తమిళ్, కన్నడ, మలయాళంలో ఒకేసారి సాహో విడుద‌ల‌వుతోంది.

Leave a comment