వేశ్య‌గా మారిన యంగ్ హీరోయిన్‌..!

టాలీవుడ్‌లో ఇటీవ‌ల ట్రెండ్ మారుతోంది. యంగ్ హీరోయిన్లు మ‌రీ బోల్డ్‌గా ఉన్న పాత్ర‌లో న‌టించేందుకు కూడా రెడీ అయిపోతున్నారు. లిప్‌కిస్‌లు, బూతు డైలాగులు, అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు యంగ్ హీరోయిన్లు ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా ఓకే చెప్పేస్తున్నారు. ఇక ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న పాయ‌ల్ రాజ్‌పుత్ ఇప్పుడు వేశ్య‌గా మారుతోంది.

వ‌రుస ప్లాపుల‌తో విల‌విల్లాడుతోన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సెన్షేష‌న‌ల్ బ‌యోపిక్‌లో పాయ‌ల్ రాజ్‌పుత్ వేశ్య పాత్ర‌లో న‌టిస్తోంది. ఆర్ఎక్స్‌లో బోల్డ్ క్యారెక్ట‌ర్‌తో యూత్ మ‌దిలో గిలిగింత‌లు పెట్టిన పాయ‌ల్ మ‌రో బోల్డ్ క్యారెక్ట‌ర్ రోల్‌కు రెడీ అవుతోంది.

ఇక ‘టైగర్ నాగేశ్వర్రావు’ గురించి ఈ జ‌న‌రేష‌న్‌కు పెద్ద‌గా తెలియ‌దు. 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. అలాంటి సెన్షేష‌న‌ల్ బ‌యోపిక్‌లో న‌టించేందుకు రెడీ అవుతోన్న సాయి శ్రీనివాస్ ఈ సినిమాతో అయినా హిట్ కొడ‌తాడా ? లేదా ? చూడాలి. ఆగ‌స్టు నుంచి ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

ప్ర‌ముఖ మాట‌ల ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ ఈ సినిమాకు మాట‌లు అందిస్తున్నారు. ఇక నాగేశ్వ‌ర‌రావు దొంగ‌గా వేశ్య‌ను బ్లాక్ మెయిల్ చేస్తాడ‌ని.. త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఉంటుంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం మ‌రి.. ఇప్పుడు ఈ క‌థ‌ను ఎలా మారుస్తారో ? చూడాలి.

Leave a comment