‘ ఓ బేబీ ‘ థియేట్రికల్ ట్రైలర్.. అదరకొట్టిన సమంత..

ఓ బేబీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. 2.12 నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్‌లో స‌మంత వ‌న్ మ్యాన్ షో చేసేసింది. మ‌నిషిగా చూడ‌డానికి 24 ఏళ్ల బేబీలా ఉండే స‌మంత ఆలోచ‌న‌లు అన్ని 70 ఏళ్ల బామ్మ‌లా ఉంటాయి. బేబీగా చూడ‌డానికి క్యూట్‌గానే ఉన్నా మాట మాత్రం మ‌హానాటుగా ఉంది. ఓ బేబీ అని ధ‌న్‌రాజ్ అంటే బేబీలా క‌నిపిస్తున్నానేంట్రా స‌చ్చినోడా అని చెంప‌లు వాయించేస్తుంది.

నాగ‌శౌర్య మంచి హ‌జ్జెండ్ అంటే ఎలా ఉండాల‌నుకుంటున్నావ్ అని అడిగితే చూడ‌డానికి అందంగా ఉండాలి…. నేనేం కొనుక్కోవాల‌నుకున్నా ఆడి ద‌గ్గ‌ర స‌రిప‌డా డ‌బ్బులు ఉండాలి…. మ‌గాడిలా కాపురం చేయాలి అన‌గానే నాగ‌శౌర్యకు ఒక్క‌సారిగా షాక్ కొట్టినంత ప‌న‌వుతుంది. ఇక సీనియ‌ర్ హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్ బేబీలా అయిపోవాలి… కుర్రాడిని అయిపోవాల‌ని చేసే క‌స‌ర‌త్తులు కామెడీ ట్రాక్‌లో భాగం కానున్నాయి.

సినిమాలో స‌మంత రోల్ ప‌రంగా చూస్తే చిలిపి, కామెడీతో పాటు ఎమోష‌న్‌కు కూడా స్కోప్ ఎక్కువే ఉంది.
మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ ట్రైల‌ర్‌కు త‌గిన‌ట్టుగా ఉంది. సినిమాలో నేప‌థ్య సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉంద‌ని తెలుస్తోంది. ఇక ట్రైల‌ర్ చూస్తుంటే కొత్త‌గానే క‌నిపిస్తోంది. సురేష్‌బాబు రిలీజ్ చేస్తుండడంతో సినిమాకు టాక్ బాగుంటే క‌లెక్ష‌న్లు కూడా క‌మ్ముకోవ‌చ్చు. మొత్తానికి స‌మంత కెరీర్‌లో ఓ బేబీ ఓ డిఫ‌రెంట్ ఫిల్మ్ మాత్రం అవుతుంద‌ని తెలుస్తోంది.

Leave a comment