మ‌న్మ‌థుడు 2 మూవీ… స్టోరీ కాపీ కొట్టేశారుగా…

సోషల్ మీడియా వచ్చాక సినిమా క్రియేట‌ర్లకు తీవ్రమైన సంకట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. క్రియేటర్లు తమ సినిమాలో కొన్ని సీన్లను ఇతర భాషలకు చెందిన… ఇంకా చెప్పాలంటే విదేశీ భాషలకు చెందిన సినిమాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకుంటున్నారు. డైరెక్టర్‌లు ప్రపంచంలో ఏ మూల.. ఏ బాషలో ఉన్న సినిమాను చూసి చిన్నసీన్ కాపీ కొట్టినా సోషల్ మీడియా ప్రభావంతో వాళ్లు సులువుగా దొరికిపోతున్నారు.

ఇలా దొరికిపోయిన వాళ్ళను ఆడుకోవటం నెటిజన్ల వంతు అవుతోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటిస్తున్న మన్మధుడు 2 స్టోరీ మీద కూడా ఇప్పుడు కాపీ ప్రచారం బయటకు వచ్చేసింది. 2002 డిసెంబర్‌లో నాగార్జున నటించిన మ‌న్మ‌ధుడు సినిమా నాగార్జున‌కు కెరియ‌ర్‌లోనే తిరుగులేని రుమాంటిక్ హీరో ఇమేజ్ తీసుకువ‌చ్చింది. మన్మధుడు వచ్చిన తర్వాత 17 సంవత్సరాలకు ఆ సినిమాకు కంటిన్యూగా వస్తున్న‌ మన్మధుడు 2 స్టోరీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా టీజర్‌ కూడా రిలీజ్ అయింది. ఈ టీజర్ చూసిన నెటిజన్లు ఈ సినిమా 13 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ ‘ ప్రేతే మెయి తా ఐ ‘ ఆధారంగా క‌థ‌ను రాసుకున్నార‌ని నెటిజ‌న్‌లు ట్రోల్ చేస్తున్నారు. ఆ సినిమాలో 40 ఏళ్ల వయసు వచ్చినా హీరోకు పెళ్లి కాదు. దీంతో హీరోను పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లతో పాటు స్నేహితులు ఒత్తిడి చేస్తారు. వాళ్ల‌ ఒత్తిడి భరించలేక బయట నుంచి భార్య‌ను అద్దెకు తీసుకువస్తాడు. కొన్ని రోజులు గడిచాక వారిద్దరి మధ్య అనుబంధం స్ట్రాంగ్ అవుతుంది.

ఇప్పుడు మన్మధుడు 2 స్టోరీ లైన్ కూడా కాస్త అటు ఇటుగా ఇలాగే ఉంటుందని అంటున్నారు. అంతెందుకు అప్పుడెప్పుడో వచ్చిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అల్లుడుగారు సినిమా నుంచి చిరంజీవి బావగారు బాగున్నారా దాకా ఇలాంటి పాయింట్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రతిసారి హీరో అద్దెకు వస్తాడు. ఇందులో కాస్త వెరైటీగా హీరోయిన్ అద్దెకు వస్తుంది. మరి కాపీ ఆరోప‌ణ‌లు ఎలా ? ఉన్నా అసలు ఇందులో నిజానిజాలు ఎంతన్నది కనీసం ట్రైల‌ర్ రిలీజ్ అయ్యే వ‌ర‌కు కాని చెప్ప‌లేం.

Leave a comment