ప్రభాస్ ని అప్పుడు వెక్కిరించాడు..ఇప్పుడు పొగుడుతున్నాడు!

kamal khan praises prabhas

బాలీవుడ్ లో కమల్ ఆర్ ఖాన్ ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న విషయం తెలిసిందే. ఆ మద్య పవన్ కళ్యాన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా బాలీవుడ్ లో డబ్ చేస్తే ఆ సినిమాపై దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ సినిమా గనక ఒక్కరోజు ఆడినా బట్టలిప్పుకొని తిరుగుతానని ఘోరంగా వెక్కిరించారు.

పవన్ పై మాత్రమే కాదు టాలీవుడ్ లో అందరి హీరోలపై వ్యంగంగా కామెంట్ చేస్తూ ఉండటంతో అతని సోషల్ మీడియా ఖాతాలు క్లోజ్ చేశారు. ఆ మద్య కమల్ సాహో మూవీపై నెగిటివ్ గా స్పందించాడు. రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయం.

అతిపెద్ద డిజాస్టర్స్ లో సాహో ఒకటిగా నిలుస్తుంది అంటూ కామెంట్ చేశాడు. దాంతో ఆయనపై ప్రబాస్ ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రేక్షకులు ఘాటుగానే రివర్స్ కామెంట్ చేశారు. అయితే ఉన్నట్టుండి కమల్ ఆర్ ఖాన్ సాహో మూవీపై యూటర్న్ తీసుకున్నాడు. అంతేకాదు ప్రభాస్ ని తెగ పొగిడేస్తున్నాడు.

కేవలం ప్రభాస్ ఒక్కడే జాతీయ స్థాయిలో గొప్పగా గుర్తించబడ్డ హీరో అని…టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్ లో ఎదిగిపోతాడని పొగిడేస్తున్నాడు. సాహూ టీజర్ అద్భుతంగా ఉండడంతోనే కమల్ తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

Leave a comment