Moviesకల్కి మూవీ రివ్యూ & రేటింగ్

కల్కి మూవీ రివ్యూ & రేటింగ్

సినిమా: కల్కి
నటీనటులు: రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేతా తదితరులు
మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత: సి.కళ్యాణ్
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
హీరో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్‌ గరుడవేగ చిత్రంతో స్పీడందుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో రాజశేఖర్ వరుసబెట్టి సినిమాలు చేస్తు్న్నాడు. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న రాజశేఖర్ తాజాగా నటించిన చిత్రం కల్కి. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ టీజర్, ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మరి నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ:
కొల్లాపూర్‌ అనే గ్రామంలో జరిగిన ఓ మర్డర్ మిస్టరీని చేధించేందుకు ఇన్వేస్టిగేషన్ ఆఫీసర్ కల్కి(రాజశేఖర్) ఆ ఊరికి వస్తాడు. అతడు కేసును చేధించే క్రమంలో అతడికి ఎదురయ్యే అవాంతరాలను ఎలా అధిగమించాడు అనేది ముఖ్య కథ. ఇంతకీ మర్డర్ ఎవరిది జరిగింది..? కొల్లాపూర్ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి..? కల్కి ఈ కేసును ఎలా చేధించాడు..? అతడికి సహాయం ఎవరు చేస్తారు..? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
తెలంగాణ 1980 కాలం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో ఆనాటి ఆచారాలను దర్శకుడు మనకు చూపించాడు. ఒక ఊరిలో జరిగిన మర్డర్ కేసును పరిష్కరించేందుకు ఐపీఎస్ ఆఫీసర్ కల్కి ఆ ఊరికి వస్తాడు. ఈ క్రమంలో అతడు ఊరివారితో ఎదుర్కొనే సమస్యలు.. అతడికి ఎవరూ సాయం చేయకపోవడాన్ని మనకు ఫస్టాఫ్‌లో చూపించారు. ఇక ఈ క్రమంలో అతడికి సహాయపడే వ్యక్తిగా రాహుల్ రామకృష్ణ నటించాడు.
ఇదే క్రమంలో కల్కి ఫ్లాష్‌బ్యాక్‌ను చూపించాడు దర్శకుడు. కట్ చేస్తే.. కేసు మిస్టరీని చేధించే క్రమంలో కల్కికి ఎదురయ్యే సమస్యలను అతడు తెలివిగా ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాలను బాగా చూపించాడు దర్శకుడు. ఈ క్రమంలో చాలా ట్విస్టులు, వాటిని రివీల్ చేసే సన్నివేశాలతో కల్కి చిత్రం పై ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే ఇది చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు.
ఇక క్లైమాక్స్ ట్విస్టులను దర్శకుడు రివీల్ చేసిన విధానం ప్రేక్షకులకు కాస్త నచ్చకపోవచ్చు. ఏదేమైనా దర్శకుడు చిన్న స్టోరీలైన్‌ను ప్రెజెంట్ చేసిన విధానం బాగున్నా.. ట్విస్టులు ఎక్కువగా ఉండటం.. అనవసరపు సీన్లు ఈ సినిమాను కాస్త బోరింగ్‌గా చేస్తాయి. ఓవరాల్‌గా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకునే వారు ‘కల్కి’ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు.
నటీనటుల పర్ఫార్మెన్స్:
‘కల్కి’గా రాజశేఖర్ చాలాబాగా నటించాడు. ఓ మర్డర్ కేసును చేధించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ మెప్పించాడు. ఇక అతడు చేసే కామెడీ ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. హరోయిన్లు అదా శర్మ, నందితా శ్వేతా పర్వాలేదనిపించారు. ఇక మిగతా నటీనటుల్లో అశుతోష్ రానా, నాజర్, రాహుల్ రామకృష్ణ మెప్పించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తాను అనుకున్న రీతిలో తెరకెక్కించాడు. తాను రాసుకున్న కథను ఉన్నది ఉన్నట్లుగా ప్రెజెంట్ చేశాడు. అయితే ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేయాలనే అతడి ఆలోచన బెడిసికొట్టింది. ఒకటి రెండు ట్విస్టులకు సరిపెట్టుకునే ప్రేక్షకులు సినిమాలో ఇన్ని ట్విస్టులను జీర్ణించుకోలేకపోయారు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా కలిసొచ్చింది. అటు సంగీతం కూడా పర్వాలేదనిపించింది.

చివరగా:
కల్కి – వీడి తెలివి అమోఘం..!
రేటింగ్: 2.75/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news