ఫ‌ల‌క్‌నామా దాస్ బంప‌ర్ డీల్‌తో కుమ్మేశాడు..

ఫ‌ల‌క్‌నామా దాస్‌తో ఇప్పుడు హీరో, నిర్మాత & డైరెక్ట‌ర్ విశ్వ‌క్‌సేన్ సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తున్నాడు. ఓ మోస్త‌రు అంచ‌నాల‌తో వ‌చ్చిన దాస్ సినిమాకు రివ్యూవ‌ర్ల నుంచి ఎలాంటి అంచ‌నాలు ఉన్నా, ఫ‌క్తు బూతు సినిమాగా ముద్ర ప‌డినా, విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ వ‌ర్సెస్ దాస్ మ‌ధ్య ట్రోలింగ్‌, మాట‌ల యుద్ధం న‌డిచినా అవ‌న్నీ ఈ సినిమాకు ప్ల‌స్ అయ్యాయి.

ఇక ఇప్పుడు ఫ‌ల‌క్‌నామా దాస్ బంప‌ర్ డీల్ ప‌ట్టేశాడు. రూ.5 కోట్ల‌తో రిలీజ్ అయిన‌ట్టు చెప్పుకుంటోన్న ఈ సినిమా ఒక్క నైజాంలోనే ఫ‌స్ట్ వీకెండ్‌కే రూ.2 కోట్లు రాబ‌ట్టేసింది. ఇక సినిమాను సురేష్‌బాబు రూ. 2.5 కోట్ల అడ్వాన్స్‌తో రిలీజ్ చేశారు. ఇక సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.2 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఇది ఈ సినిమాకు నిజంగానే పెద్ద ఆఫ‌ర్‌.

ఇంకా శాటిలైట్ ఉంది. ఇది ఎంత లేద‌న్నా రూ. 3 కోట్ల వ‌ర‌కు వ‌చ్చే ఛాన్స్ ఉందంని అంచ‌నా. ఇక ఇత‌ర భాష‌ల డ‌బ్బింగ్ రైట్స్ క‌లుపుకుంటే విశ్వ‌క్‌సేన్‌కు ఇది మంచి సేఫ్ వెంచ‌ర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది. ఇక సీడెడ్‌, కోస్తా క‌లెక్ష‌న్లు కూడా చూస్తే మ‌రిన్ని లాభాలు విశ్వ‌క్‌కు యాడ్ కానున్నాయి.

Leave a comment