‘ఆమె’ టీజర్.. న్యూడ్ గా అమలా పాల్ షాక్ ఇచ్చింది..!

సౌత్ లో హాట్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న వారిలో అమలా పాల్ ఒకరు. మళయాళ పరిశ్రమ నుండి వచ్చిన ఈ భామ తమిళంలో స్టార్ ఇమేజ్ సాధించింది. తెలుగులో చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా ఆమెకు ఇక్కడ సూపర్ ఫాలోయింగ్ ఉంది. డైరక్టర్ విజయ్ తో మ్యారేజ్ ఆ తర్వాత డైవర్స్ అమలా పాల్ సిని కెరియర్ ను కాస్త డిస్ట్రబ్ చేశాయి. అయితే ఇప్పుడు ఆమె వరుస సినిమాలు చేస్తుంది.

ఆల్రెడీ కన్నడలో స్టార్స్ తో జత కడుతున్న అమ్మడు తమిళంలో ప్రయోగాత్మక సినిమాలకు సై అంటుంది. ఈ క్రమంలో తమిళంలో అమలా పాల్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆడై.. తెలుగులో ఆమెగా డబ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. ఒంటి మీద నూలిపోగు కూడా లేకుండా అమలా పాల్ న్యూడ్ గా కనిపించి షాక్ ఇచ్చింది. అయితే దాచేయాల్సినవన్ని దాచేసి న్యూడ్ స్టిల్ ఇచ్చిందన్నమాట.

సస్పెన్స్ థ్రిల్లర్ గా అనిపిస్తున్న ఆమె సినిమా తెలుగు టీజర్ కూడా బాగా క్లిక్ అయ్యింది. తెలుగులో ఈ సినిమాను తమ్మా రెడ్డి భరధ్వాజ్ రిలీజ్ చేస్తున్నారు. అమలా పాల్ తెలుగు ఫ్యాన్స్ కు ఈ సినిమా స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. టీజర్ లోనే ఇలా సర్ ప్రైజ్ చేసింది అంటే ఇక సినిమాలో అమలా ఏ రేంజ్ లో నటించిందో అర్ధం చేసుకోవచ్చు.

Leave a comment