తల్లి కాబోతున్న ప్రముఖ సింగర్ గీతామాధురి..!

తెలుగు తెరపై ఎన్నో అద్బుతమైన గీతాలు ఆలపించిన సింగర్ గీతామాధురి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆమె సింగర్ గానే కాకుండా యాంకర్, నటిగా అన్ని రంగాల్లో తన సత్తా చాటుతుంది. ఆ మద్య తెలుగులొో వచ్చి బిగ్ బాస్ సీజన్ 2 లో గీతామాధురి చేసిన సందడి అంతా ఇంతా కాదు.

మొదటి నుంచి చాక చాక్యంగా ఆడుతూ.. చివరి వరకు బిగ్ బాస్ విన్నర్ కి పోటీగా ఉంటూ..రన్నరప్ గా నిలిచింది గీతామాధురి. 2014లో సినీ నటుడు చందు ని ప్రేమించి పెళ్లి చేసున్న గీతామాధరి తాజాగా తల్లి కాబోతుందని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఈ మద్యనే ఆమెకు శ్రీమంతం కూడా జరిగిందట.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం గీతా మాధురి సింగర్ గా రాణిస్తుంటే..చందు నటుడిగా రాణిస్తున్నారు. గీతా మాధురి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో 500పైగా పాటలు పాడారు.

Leave a comment