జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చేసిన క్రికెటర్ రోహిత్ శర్మ..

ఇండియా క్రికెట్ జట్టులో కొహ్లి తర్వాత అంత క్రేజ్ ఉన్న ఆటగాడు అంటే రోహిత్ శర్మ అని చెప్పొచ్చు. ధోని కెప్టెన్ గా ఉన్నప్పటి నుండి రోహిత్ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. రీసెంట్ గా జరిగిన ఐపిఎల్ లో ముంబై కెప్టెన్ గా విజయ సారధిగా నిలిచాడు రోహిత్ శర్మ. అయితే రోహిత్ హిందిలో సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమట.. తెలుగులో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా తనకు ఇష్టమని చెప్పాడు రోహిత్ శర్మ.

సల్మాన్ ఖాన్ అప్పీ ఫిక్ యాడ్ తెలుగులో తారక్ చేశాడు. ఆ యాడ్ చూశాక ఎన్.టి.ఆర్ సినిమాలు, డ్యాన్సులు ఇలా అన్నిటి గురించి తెలుసుకున్నాడట రోహిత్ శర్మ. ఎన్.టి.ఆర్ లాంటి డ్యాన్సర్ ఉండటం టాలీవుడ్ చేసుకున్న అదృష్టమని రోహిత్ శర్మ అన్నాడట. అంతేకాదు అప్పటినుండి తారక్ ను నేను ఫ్యాన్ అయ్యానని చెప్పాడట. మొత్తానికి తెలుగు హీరోల క్రేజ్ నేషనల్ వైడ్ గా పాకుతుంది.

లేటెస్ట్ గా క్రికెటర్స్ కు మన హీరోల సత్తా ఏంటో తెలుస్తుంది. బాహుబలితో ప్రభాస్ కు నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. ఆ సినిమా టైంలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్రభాస్ గురించి ప్రస్థావించాడు. మొత్తానికి తెలుగు హీరోల గురించి క్రికెటర్స్ లో చర్చకు రావడం మంచి పరిణామమే అని చెప్పొచ్చు.

Leave a comment