ముగ్గురు హీరోలతో..మూడు షిఫ్టులతో తెగ కష్టపడిందట!

టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యూటీలు ఇప్పటి వరకు ఎంతో మంది వచ్చారు. కానీ అతి కొద్ది మందే సక్సెస్ సాధించి కొంత కాలం ఇక్కడ నిలిచారు. అలాంటి వారిలో రకూల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పుకోవొచ్చు. ఆ తర్వాత రాశీఖన్నా కూడా కెరీర్ నిలుపుకోవడానికి కష్టపడుతుంది. ఇక ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన పూజా హెగ్డేకి తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు. ఈ సినిమాల్లో ఏమాత్రం గ్లామర్ గా కనిపించలేదు.

హరిష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధం మూవీ పూజా హెగ్డే జీవితాన్ని మార్చింది. అప్పటి నుంచి వరుసగా సినిమా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఈ సినిమాలో బికినీతో రెచ్చిపోయింది పూజా హెగ్డే..దాంతో దర్శక నిర్మాతలు వరుసగా గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇస్తున్నారు.

ఆ మద్య ఎన్టీఆర్ తో అరవింత సమేత, తాజాగా మహేష్ బాబు తో ‘మహర్షి’, ప్రభాస్ తో మరో మూవీలో నటిస్తుంది పూజా హెగ్డే. ఒప్పుడు వరుసగా హీరోలు, హీరోయిన్లు మూడు షిఫ్టుల్లో నటించేవారు. ఇదే తరహాలో పూజా హెగ్డె కూడా మూడు షిఫ్లుల్లో పనిచేసిందట.

ఒక టైం లో ఉదయం 7 నుండి 12 వరకు ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’, మధ్యాహ్నం 2 నుండి 6 వరకు మహేష్ బాబు ‘మహర్షి’, రాత్రి 9 నుండి ఉదయం 2 గంటల వరకు ప్రభాస్ తో సినిమా చేశానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఒకేసారి ముగ్గురు పెద్ద హీరోలతో కలిసి చేయడం తన కెరీర్ లో బెస్ట్ మూమెంట్ అని అంటోంది.

Leave a comment