మళ్లీ ఆ డైరెక్టర్‌కే తారక్ ఓటు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనపుట్టిన రోజును చాలా సాదాసీదాగా చేసుకున్నాడు. అభిమానులు ఎలాంటి వేడుకలు చేయొద్దంటూ తారక్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తారక్‌ సింప్లీసిటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతూ తమ అభిమాన నటుడు చెప్పిన విధంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆయన పుట్టినరోజును చేసుకున్నారు. ఇక సినిమాల పరంగా ప్రస్తుతం తారక్ RRR సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తారక్ బర్త్‌డే సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

తారక్-చరణ్‌ల మల్టీస్టారర్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం యావత్ ప్రేక్షకలోకం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా తారక్ తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టేసినట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కే మనోడు మరోసారి ఓటేసినట్లు అభిమానులు తెలిపారు. ఇటీవల అరవింద సమేత వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన త్రివిక్రమ్ తారక్ కోసం మరో అదిరిపోయే పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేస్తున్నట్లు టాక్. అయితే త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో త్రివిక్రమ్ కోసం ఇద్దరు హీరోలు వెయిట్ చేస్తుంటే.. మరి ఆ డైరెక్టర్ ఎవరికి ఓటేస్తాడా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కాగా RRR కోసం తారక్ తన పూర్తి సమయాన్ని కేటాయించేందుకు ఎలాంటి కమిట్‌మెంట్స్‌కు ఒప్పుకోలేదు. అటు త్రివిక్రమ్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Leave a comment