తప్పెక్కడ జరిగిందో వెతుకుతున్న హీరోలు..

ఇటీవల యంగ్ హీరోలు నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ కాలేదు. దీంతో తమ నెక్ట్స్ మూవీలను ఎలాగైనా హిట్ చేయాలనే కసితో వరుసబెట్టి తమ సినిమాలను పట్టాలెక్కి్స్తున్నారు. అయితే వారు ఎంత ఆచితూచి సినిమాలు చేసినా దరిద్రం వారిని వెంటాడుతూనే ఉంది. దీంతో చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బిస్కెట్‌లుగా మిగులుతున్నాయి. ఈ లిస్టులో నేచురల్ స్టార్ నాని, మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌లు మొదటి స్థానాల్లో నిలిచారు.

పాపం నాని.. ఒకప్పుడు వరుసబెట్టి హిట్ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ హీరోగా నిలిచాడు. అయితే నాని ఎంతో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించిన జెర్సీ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. కానీ.. కమర్షియల్ పరంగా మాత్రం వెనుకంజలో నిలిచింది. నాని యాక్టింగ్ బాగుందని.. కథాపరంగా సినిమా సూపర్ అనే టాక్ వచ్చినా మాస్ వర్గాల్లో మాత్రం సినిమా బోల్తా కొట్టింది. అటు మెగా సాయి ధరమ్ తేజ్ కూడా వరుస ఫెయిల్యూర్స్‌తో విసుగెత్తి చిత్రలహరి అనే సినిమాపై ఫుల్ కాన్పిడెన్స్‌తో మనముందుకు వచ్చాడు.

అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో తేజు డైలమాలో పడిపోయాడు. అయితే తాము ఎంచుకున్న సినిమా కథలు బాగానే ఉన్నా.. తేడా ఎక్కడ కొట్టిందా అని వెతుకుతున్నారు ఈ కుర్ర హీరోలు. ఏదేమైనా అదృష్టం లేనప్పుడు ఎంత మంచి సినిమా చేసినా అంతే గురూ!

Leave a comment