బాలయ్యకు హనీ పూస్తానంటున్న బ్యూటీ

నందమూరి బాలకృష్ణ రాజకీయాల కోసం సినిమాలకు కొంత కాలంగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు బాలయ్య. అయితే బోయపాటి శ్రీనుతో బాలయ్య మరో సినిమా ఉండబోతుందని సినీ వర్గాలు అనుకున్నారు. కానీ.. అందరికీ షాకిస్తూ బాలయ్య తన నెక్ట్స్ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌తో నటించబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. అయితే బాలయ్యకు హనీ పూస్తానంటోంది ఓ బ్యూటీ.

బాలయ్యకు హీరోయిన్‌గా ఆ సినిమాలో మెహ్రీన్ పీర్జాదాను నటింపజేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. అయితే ఇందులో బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు మరే ఇతర హీరోయిన్‌ సెట్ కాదని చిత్ర యూనిట్ ఫుల్ ధీమాగా ఉన్నారు. అందుకే మరే ఇతర హీరోయిన్‌ను సెలెక్ట్ చేయకుండా ఎలాగైనా మెహ్రీన్‌నే ఈ సినిమాలో నటింపజేయాలని చిత్ర యూనిట్ ట్రై చేస్తున్నారు. కాగా బాలయ్య లాంటి సీనియర్ హీరోతో మెహ్రీన్ ఎలా రొమాన్స్ చేస్తుందా అని నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

కాగా హిందూపురం ఎమ్మెల్యేగా పనిచేసిన బాలయ్య ఈ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారా లేరా అనేది రేపటితో తేలనుంది. బాలయ్య-మెహ్రీన్ కాంబినేషన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.

Leave a comment